విజయ్ దేవరకొండను పవన్ కల్యాణ్‌తో పోల్చిన ప్రముఖ అగ్ర నిర్మాత
విజయ్ దేవరకొండను పవన్ కల్యాణ్‌తో పోల్చిన ప్రముఖ అగ్ర నిర్మాత
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో టాలీవుడ్‌లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం సినిమాతో అభిమానులను మరింత మెస్మరైజ్ చేశాడు. విజయ్ దేవరకొండ పర్‌ఫార్మెన్స్ చూసి అభిమానులే కాదు... సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సినిమా సక్సెస్ రేటు చూసి ఔరా అని ముక్కున వేళ్లేసుకుంటున్న సినీ ప్రముఖులు ఆ సినిమా గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేయగా అదే వేదికపై అగ్రనిర్మాత దిల్ రాజు అతడిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పోల్చడం సినీవర్గాల్లో చర్చనియాంశమైంది.
గత 10-15 ఏళ్లలో ఎంతోమంది స్టార్స్ అయ్యారు కానీ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా తర్వాత అతడికి ఎంత పేరొచ్చిందో అలా పేరు తెచ్చుకున్న నటుడు మాత్రం విజయ్ దేవరకొండ మాత్రమే అని చెప్పి దిల్ రాజు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అంతేకాకుండా గీత గోవిందం కలెక్షన్స్ చూసి తామంతా షాకైనట్టు చెప్పకుండా ఉండలేకపోయాడు దిల్ రాజు. ఇంకేం.. తెలుగు సినీ ప్రముఖులు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న విజయ్ దేవరకొండకు ఇక ఎదురు లేనట్టేనేమోననే టాక్ వినిపిస్తోంది.