Dil raju Varisu : నోరు జారిన వంశీ పైడిపల్లి.. దిల్ రాజుకు చిక్కులు.. నిర్మాత ఫైర్
Dil raju Feels fires Vamsi Paidipally దిల్ రాజు లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. కానీ వాటిని వంశీ పైడిపల్లి అంతగా ఒడిసి పట్టలేదనిపిస్తోంది. తాజాగా వంశీ పైడిపల్లి చేసిన కామెంట్లపై దిల్ రాజు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Dil raju Varisu : దిల్ రాజు ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ వారిసు సినిమా గురించి వంశీ పైడిపల్లి చేసిన కామెంట్ల మీద దిల్ రాజు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు అయితే ఈ సినిమాను ద్విభాష చిత్రంగా ప్రమోట్ చేయాలని చూస్తున్నాడట. కానీ వంశీ పైడిపల్లి మాత్రం ఈ సినిమాను పక్కా తమిళ సినిమాగా చెప్పేశాడు. తెలుగులో డబ్ చేస్తారని కూడా అనేశాడు. దీంతో దిల్ రాజుకు ఇప్పుడు చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ఇది సంక్రాంతి బరిలోకి దిగుతోంది.
సంక్రాంతికి మన తెలుగు చిత్రాలకే థియేటర్లు దొరకవు. దీంతో పక్క భాషల చిత్రాలకే థియేటర్లు ఇవ్వడం కష్టంగా మారుతుంది. ప్రతీసారి ఇలానే డబ్బింగ్ సినిమాల రిలీజ్‌ల విషయంలో వివాదాలు వస్తుంటాయి. ఆ మధ్య రజినీకాంత్ సినిమాకే థియేటర్లు సరిగ్గా ఇవ్వలేదని డిస్ట్రిబ్యూటర్లు వాపోయారు. ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లి చేసిన కామెంట్లతో వారసుడు సినిమా కేవలం డబ్బింగ్ సినిమా అనేది అర్థమైంది.
ఇది తమిళ సినిమా అని, తెలుగులో డబ్బింగ్ చేస్తామని చెప్పడంతో దిల్ రాజు తన డైరెక్టర్ మీద ఫైర్ అయినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి మాటలతో ఆల్రెడీ ఈ చిత్రం మీద నెగెటివిటీ పెరిగింది. ఈ పోస్టర్లలో కొత్తదనం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. మహర్షి సినిమాకు సీక్వెలా? ఫ్రీమేకా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
మరి ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తే దిల్ రాజు ఏం చేస్తాడన్నది చూడాలి. ఒక వైపు బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు బరిలో ఉన్నాయి. మరి వీటి ఎదుట వారసుడు సినిమాను ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తారో చూడాలి.
Also Read : Puri Jagannadh Complaint : పూరి ఫిర్యాదు.. ఫైనాన్షియర్ శోభన్ సంచలన వ్యాఖ్యలు.. ఎక్కడా కనిపించని ఛార్మీ?
Also Read : Nayanthara Surrogacy Report : నయనతార సరోగసి వివాదం.. హడావిడి చేసిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి