Dilraju is busy in blocking more Theaters for Varasudu: తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి 2019 సంక్రాంతి విడుదల సమయంలో ఆయన తన ఎఫ్2 సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఆ సమయంలో రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాకి థియేటర్లు దొరక్కుండా ఎక్కువగా తన సినిమానే థియేటర్లలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో ఆ సినిమా నిర్మాతలకు దిల్ రాజు చెప్పిన లాజిక్ ఏమిటంటే తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్నప్పుడు ఇతర భాషల నుంచి సినిమాలు తెచ్చి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? మొదటి ప్రాధాన్యత స్ట్రైట్ సినిమాలకే అంటూ చెప్పకొచ్చారు. అయితే ఇదే విషయం మీద 2021 సంక్రాంతి విషయంలో మాత్రం ఆయన మాట తప్పారు. అప్పట్లో ఆయన మాస్టర్ సినిమా హక్కులు కొనుక్కున్నారు. విజయ్ హీరోగా తమిళంలో రిలీజ్ అయిన ఆ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు.


 అప్పుడు స్ట్రైట్ సినిమా అయిన క్రాక్ సినిమాకి థియేటర్లు దొరక్కుండా తన మాస్టర్ సినిమాకి థియేటర్లు ఇప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు వారిసు అనే ఒక సినిమా చేస్తున్నారు. ప్రకటించిన సమయంలో ఇది తమిళ తెలుగు బై లింగ్యువల్ డైలీ మూవీ అని ప్రకటించారు. కానీ తరువాత మాత్రం దీన్ని తమిళ సినిమాగా చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా దీనికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.


అదేమిటంటే తమిళనాడులో ఇతర భాషల సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలంటే టాక్స్ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. స్ట్రైట్ సినిమాలకు టాక్స్ ఉండదు. అదేవిధంగా ఇటీవల తెలుగు సినిమాల షూటింగ్స్ అన్నీ దిల్ రాజు దగ్గరుండి నిలిపివేయించిన సమయంలో కూడా తన సినిమా షూటింగ్ జరుపుకున్నారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే అది తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తున్నానని.  ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని అప్పట్లో పేట సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రసన్నకుమార్ పట్టుకున్నారు.


ప్రస్తుతం ఆయన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీగా ఉన్నారు. ఈ నేపద్యంలో దిల్ రాజు అప్పట్లో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తాజాగా ఒక ప్రశ్న విడుదల చేసి ఎగ్జిబిటర్లు మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాకి ఇవ్వాలని కోరారు. అయితే వారు కోరినంత మాత్రాన ఎగ్జిబిటర్లు మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలు గా ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు కదా. కేవలం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంతే. దిల్ రాజు మాత్రం తన సాశాయశక్తులా కృషి చేసి వారసుడు సినిమాకి థియేటర్లను బ్లాక్ చేసే పనిలోపడ్డారు.


ఒకరకంగా చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళ స్ట్రాంగ్ జోన్స్ గా చెప్పుకునే గుంటూరు, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో కూడా వారసుడు సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కించుకునే ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలతో బరిలోకి దిగుతున్నా దిల్ రాజు ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాన్ని తాను చేస్తున్నారంటే ఈ విషయంలో చిరంజీవి బాలకృష్ణ రంగంలోకి దిగితే తప్ప దిల్ రాజు స్పీడుకు కళ్లెం వేసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు పెడితే వాటి వల్ల ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో దిల్ రాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఒకవేళ తీసుకుంటే దిల్ రాజు వెనక్కి తగ్గుతారా? లేదా? అనే విషయం మీద చర్చ జరుగుతోంది.


Also Read: Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?


Also Read: Super Star Krishna Cardiac Arrest : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. క్రిటికల్ స్టేజ్.. వైద్యులు ఏమన్నారంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook