Prabhas:సినిమాల ప్రమోషన్స్లో దిల్ రాజుని తలదన్నే వారు లేరు. అందుకే ఏదైనా చిన్న సినిమా అయినా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు లేదా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు అంటే.. ఆ సినిమాకి ఎంతో క్రేజ్ వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన నిర్మాణ సంస్థకు అంతలా పేరు తెచ్చుకున్నారు ఈ నిర్మాత. అంతేకాదు సినిమా విజయం సాధించిన ఫ్లాప్ అయినా ఉన్నది ఉన్నట్టు మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటారు. కాగా ప్రస్తుతం దిల్ రాజు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను చెప్పుకొచ్చారు ఈ ప్రొడ్యూసర్. ‘దిల్ సినిమాతో నేను సంపాదించింది మొత్తం ఆ తరువాత తరుణ్‌తో చేసిన ‘నిన్నే ఇష్టపడ్డాను’తో పోయింది. ఇక మళ్లీ తేజ దర్శకత్వంలో నవదీప్‌తో చేసిన ‘జై’తో సినిమాతో బాగా నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో నేను చాలా షేకింగ్‌లో ఉన్నాను. అలాంటి టైంలో ‘ఆర్య’ సినిమా వచ్చి నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా నిలబెట్టింది. నేను షేకింగ్‌లో ఉన్న టైంలో ఏదొక మ్యాజిక్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ దాదాపు చాలా సార్లు అలాగే జరిగింది. డబ్బురావడం.. పోవడం అనేది.. ఇండస్ట్రీలో సాధారణమైన విషయం. కానీ నేను నిలబడటం అనేది ముఖ్యం. నాకు ఏదన్నా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనిపిస్తే..అది జరుగుతుంది. డౌట్ పడ్డానంటే ఆడదు. నాకు ప్రభాస్ ‘మున్నా’ సినిమా చూసినప్పుడు డౌట్ కొట్టింది. ఆ సినిమా చూసిన వెంటనే.. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఫోన్ చేసి మాట్లాడాను. ఈ సినిమా డిజప్పాయింట్ చేస్తుంది.. మీరు ఫీల్ కావొద్దని చెప్పాను. రీసెంట్‌గా చెలియా సినిమా కూడా అలాగే జరిగింది. అది బ్యాడ్ ఫిల్మ్.. రాంగ్ స్టెప్ వేశాం అని డిస్ట్రిబ్యూటర్స్‌తో చెప్పాను’ అని చెప్పుకొచ్చారు.


‘పెద్దసినిమాలకు.. పెద్ద హీరోలు.. మంచి దర్శకులు చాలా అవసరం ఎందుకంటే సినిమా రేంజ్ ని డిసైడ్ చేసేది హీరో రేంజ్. అంతేకాకుండా హీరోకి తగినట్టే దర్శకుడు, టెక్నీషియన్స్‌ని సెట్ చేయాలి. ఖర్చు పెరిగిపోతుందంటే ఏం చేయలేని పరిస్థితి. కానీ అలాంటివి నాలాంటోడు అడిగితే మేము మమ్మల్ని తప్పుగా చూస్తారు. నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకి మహేష్ బాబు ని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అడిగాను అలానే వెంకటేష్ ని కూడా అడిగి.. ఇద్దరూ రెమ్యూనరేషన్ తగ్గించుకునేట్టు చేయగలిగాను. ఆ ప్రాజెక్ట్ జరగడానికి ముఖ్య కారణం మహేష్ బాబు గారే. ఆయన ఆ సినిమా మొత్తం 
 ఎక్కడా కూడా కంప్రమైజ్ కాలేదు. నేచురల్‌గానే తీయాలి.. సెట్స్, ఫైట్స్ హడావిడి ఏం వద్దు అన్నారు. అలాగే తీశాం’ అని తెలియజేశారు దిల్ రాజు.


Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం


Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook