Dil Raju: నేనుండేది ఆరు నెలలే.. ఆ తర్వాత కనిపించను.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..
Dil Raju - Film Producer council : తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రింట్, వెబ్, టెలివిజన్ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలని దిల్ రాజు నేతృత్వంలోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
Dil Raju - Film Producer council : నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సినిమా హడావుడి ముగిసిన తర్వాత మరోసారి ప్రింట్, వెబ్, మీడియా వాళ్లతో ఇంట్రాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ , వై వి ఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల మరియు ఏ కే ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాజేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ : ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యమైన విషయాలు మీడియా షేర్ చేసారు. సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ.జీ.విశ్వప్రసాద్, వివేక్ హీరో రవితేజ ముందుకొచ్చి తమ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు వచ్చిన వెంటనే ఏ కే ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు అనిల్ సుంకర, రాజేష్ తో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది.
సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే డేట్ కి యాత్ర 2 వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు పొలిటికల్ ఇష్యూస్ మీద డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ ఛేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ గారి గెస్ట్ రోల్లో నటించిన 'లాల్ సలాం" కూడా రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్ళు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9 కి ఈగల్ మేజర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక రెండో విషయం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం జరిగింది.
దాదాపు 1. 15 నిమిషాలు సీఎం గారితో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి సమస్యలే కాదు సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి ప్రభుత్వాన్ని నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఉన్నాము అని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఉన్న సమస్యలన్నిటిమీద ఎల్లుండి ఈ సీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యలు అన్నిటికి పరిష్కారాలను తీసుకుని మళ్ళీ అతిత్వరలో సీఎం రేవంత్ రెడ్డి కలిసి దీని గురించి వివరించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఎల్లుండి మీటింగ్ పెట్టుకొని అందరినీ కలుపుకొని సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పాము. నెక్ట్స్ టర్మ్‌కు నేను ప్రెసిడెంట్‌గా ఉండను. ఆ తర్వాత కనిపించనన్నారు. ఈ రోజు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుస్తామని చెప్పారు దిల్ రాజు.
Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్ లేదబ్బా
Also Read: Bottole Thrash: 'బాటిల్' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి