Dil Raju vs Mythri Became Hot topic: తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకు మంచి పేరు ఉంది. ఆయన చేసిన సినిమాలు దాదాపుగా హిట్ అవుతాయని టాక్ ఉంది. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పలకరించకపోయినా ఆయన ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం అబ్బుర పడక తప్పదు. అయితే ఆయన ఈ మధ్యకాలంలో మైత్రి మూవీ మేకర్స్  సంస్థ నుంచి ఒక భారీ షాక్ ఎదుర్కొన్నారు. అసలు ఏమైందంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రెండు సినిమాలు తనకే ఇస్తారని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయవచ్చని దిల్ రాజు భావించారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దిల్ రాజుకు ఆ సినిమాలు ఇవ్వకుండా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో దిల్ రాజు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్లు కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మొదలుపెడితే ఈ రెండు సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ ఆగదు. కచ్చితంగా దిల్ రాజుకు పోటీగా వారు ఇతర నిర్మాతల సినిమాలు రిలీజ్ చేసి తనకు తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదు.


ఈ విషయాన్ని దిల్ రాజు జీర్ణించుకోలేకపోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన విజయ్-వంశీ పైడిపల్లి వారసుడు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా సంక్రాంతికి దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. తన ఆ ప్రొడక్షన్ లోనే కాక వేరే నిర్మాతల సినిమాలు ఏవైనా రిలీజ్ కి సిద్ధం అయ్యాయా? ఒకవేళ అయితే జనవరిలో థియేటర్లను బ్లాక్ చేసి ఆయా సినిమాలను కూడా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలకు పోటీగా ఎలా దించాలి అనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.


నిజానికి ఇప్పటికే ఆయన పలు థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడ్డారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఇప్పటికే ఫేమస్ థియేటర్లను వారసుడు సినిమా పేరుతో ఆయన బ్లాక్ చేశారని తెలుస్తోంది. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఉన్న కోపంతోనే దిల్ రాజు ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సంక్రాంతికి ఐదు పెద్ద సినిమాలు వస్తాయని అందరూ భావించారు.


ఆదిపురుష్ ఇప్పటికే వెనకడుగు వేసింది, అఖిల్ ఏజెంట్ సినిమా కూడా వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు మధ్య ప్రధాన పోటీ నెలకొంటూ ఉండగా ఆ రెండింటికి పోటీ ఇచ్చే విధంగా వారసుడు సినిమాని దిల్ రాజు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మైత్రీ మీద దిల్ రాజు పంతం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. 
Also Read: Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్


Also Read: Actor Lohithaswa: అఖండ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook