95వ వడిలోకి అడుగుపెట్టిన దిలీప్ కుమార్
ప్రముఖ బాలీవూడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ 95వ వడిలో అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు.
ముంబై: ప్రముఖ బాలీవూడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ 95వ వడిలో అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు. ఆయన అస్వస్థత దృష్ట్యా జన్మదిన వేడులకలు పెద్ద ఎత్తున చేయడంలేదని.. ఆయనకు ఇష్టమైన ఐస్ క్రీమ్, బిర్యానీ మాత్రమే సిద్ధం చేస్తున్నట్టు ఆయన భార్య, నటి సైరాబాను వెల్లడించారు. దిలీప్ కుమార్ గతకొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.
'ఆయనకు బిర్యానీ, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. డాక్టర్ల సూచన మేరకు కొద్దిగా తినిపించి ఆయన ఆనందంగా ఉండేలా చూస్తాను' అని వివరించింది. "దిలీప్ గారు మంచి డ్రెస్ లంటే ఇష్టపడతారు. కాటన్ షర్ట్, ప్యాంట్ తో పాటు మ్యాచింగ్ ను కోరుకుంటారు. షూ, సాక్స్ కూడా ఒకేరంగువి వేసుకుంటారు" అని అన్నారు. ఆయనకు ఖరీదైన బహుమతులంటే ఇష్టముండదన్నారు. మీడియా వారు మీరు ఆయనకు ఏ బహుమతి ఇస్తున్నారు అని అడిగితే.. ఆయనకు ప్రతిఏటా నేనిచ్చే ఒకేఒక బహుమతి.. ప్రేమ. అదే ఆయన్ను సంతోషంగా ఉంచుతుందన్నారు.