Mangalavaram teaser: ఆసక్తి రేపుతున్న పాయల్ `మంగళవారం` టీజర్..

Mangalavaram teaser: దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్ లో రూపొందుతున్న మరో సినిమా `మంగళవారం`. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Mangalavaram teaser Released: 'ఆర్ఎక్స్100' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'మంగళవారం'. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'ఫియర్ ఇన్ ఐస్' (కళ్లలో భయం) అనే పేరుతో ఈ మూవీని టీజర్ విడుదల చేసి ఆసక్తి పెంచేశారు. ప్రచార చిత్రం ఆద్యంతం ఉత్కంఠను కలిగించేలా ఉంది. ఈ చిత్రం ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
టీజర్ ఓపెన్ చేస్తే.. పొలాల మధ్య సీతాకోకచిలుకలు గుండ్రంగా ఎగరడంతో ప్రారంభమైన టీజర్ తొలుత ఓ అమ్మవారి ఆలయాన్ని చూపించారు. అనంతరం ప్రతి షాట్ లోనూ అందరి కళ్లనే హైలైట్ చేస్తూ భయంతో పైకి చూస్తున్నట్లుగా చూపించారు ఇందులో పాయల్ ను బోల్డ్ అండ్ సీరియస్, ఎమోషనల్ గా చూపించారు. అయితే ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేశారు. మరోవైపు ప్రచార చిత్రంలో ఎవరో ఓ వ్యక్తి అమ్మవారి మాస్క్ వేసుకుని ఉన్నట్లు.. మెుత్తం కథ అంతా దాని చుట్టే తిరిగినట్లు చూపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ బి అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
మహాసముద్రం డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అజయ్ ఘోష్, లక్ష్మణ్, చైతన్యకృష్ణ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో రిలీజ్ కానుంది. ఎ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read: Salaar Movie Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. సలార్ టీజర్ డేట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook