Madhurapudi Gramam Ane Nenu Trailer Out: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా  మూవీ 'మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను'. కళ్యాణ్‌రామ్ కత్తి మూవీ ఫేమ్ మల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టించాడు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. మెలొడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పిస్తుండగా.. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్‌కు, టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 13న ఆడియన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. స్టార్ డైరెక్ట‌ర్ బాబీ చేతుల మీతుగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. మధుర‌పూడి గ్రామం అనే నేను మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశానని.. ఈ సినిమా డైరెక్టర్ మ‌ల్లి తనకు బాగా కావాల్సిన వ్య‌క్తి అని చెప్పారు. తాను హైద‌రాబాద్‌కి, ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఇద్దరం ఒకే బైక్‌పై తిరిగేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. అప్ప‌ట్లో మోరల్‌గా తనకు ఎంతో స‌పోర్ట్‌గా ఉండేశారని.. అప్పుడ‌ప్పుడు ఫైనాన్షియ‌ల్‌గా కూడా అండగా నిలబడ్డారని చెప్పారు. తన కెరీర్‌లో ఫ‌స్ట్ క‌థ ఇచ్చిన శ్రీ‌హ‌రి గారి 'భ‌ద్రాద్రి' సినిమాకు మ‌ల్లి ద‌ర్శ‌కత్వం వహించారని పేర్కొన్నారు.


అప్పటి నుంచి ఇప్ప‌టివరకు తమ రిలేష‌న్ అలాగే కొనసాగుతోందని.. చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమా చేశారని చెప్పుకొచ్చారు బాబీ. మ‌ధుర పూడి గ్రామం అనే నేను సినిమా ట్రైల‌ర్ చూశానని.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. ఒకే ఊరిలో జ‌రిగే క‌థ‌ను చక్కగా తెరపై చూపించారని అన్నారు. రా అండ్ ర‌ప్టిక్‌గా ఉంటూనే ఎమోష‌న్స్‌తో నిండి ఉందని.. మణిశ‌ర్మ‌ సంగీతం అందించడం గొప్ప విషయమన్నారు. ట్రైల‌ర్‌లో హీరో శివ కంఠ‌మ‌నేని చాలా బాగా నటించాడని.. ఈ క్యారెక్ట‌ర్‌కి ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అనిపించాడని చెప్పారు. హీరోయిన్ క్యాథలిన్ గౌడ‌, ఇతర నటీనటులు కూడా చ‌క్క‌గా చేశారని.. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ చెప్పారు. ఎడిటర్‌గా గౌతమ్ రాజు వ్యవహరిస్తుండగా.. సినిమాటోగ్రఫీ బాధ్యతలు సురేష్ భార్గవ్ నిర్వర్తిస్తున్నారు. స్క్రీన్ ప్లే నాగ‌కృష్ణ గుండా అందస్తుండగా.. ఉదయ్ కిరణ్ మాటలు రాశారు.