Game On Release Date: గీతానంద్, నేహా సోలంకి జంట‌గా క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై తెరకెక్కిన మూవీ గేమ్ ఆన్. దయానంద్ దర్శకత్వం వహించగా.. ర‌వి క‌స్తూరి నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 2న ఆడియన్స్ ముందుకు గ్రాండ్‌గా రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ దయానంద్ మీడియాతో ముచ్చటించారు. సినిమా విశేషాలను పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేదని.. హ్యాపీడేస్ సినిమా చూసిన తరువాత మరింత ఎక్కువైందన్నారు దయానంద్. ఏ మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నేచురాల్‌గా తీయవచ్చని అనిపించిందన్నారు. పూరి జగన్నాథ్‌ స్పూర్తితో దర్శకుడు కావాలని అనుకున్నానని.. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశానని చెప్పారు. ఆ తరువాత అన్నపూర్ణ ఫిలిమ్ స్కూల్‌లో ఆరు నెలలు కోర్స్ చేశానని.. అక్కడే ప్రొడక్షన్, సౌండింగ్ నేర్చుకున్నానని తెలిపారు. కొంతమంది రైటర్స్‌తో ప్రయాణం చేశాక.. మంచి స్టోరీ రాయాలనిపించిందన్నారు. 


తాను సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీలాగా కాకుండా.. అన్నీ అంశాలు ఉంటూనే డిఫరెంట్‌గా ఉండాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు దయాకర్. తొలి చిత్రంతోనే తన మార్క్ ఉండేలా ప్రయత్నించానని.. చనిపోదామనునే వ్యక్తి జీవితంలో ఒక గేమ్ ప్రవేశిస్తే.. అతని లైఫ్ ఎలా మరిందనేది సినిమాటిక్‌గా తెరపై చూపించామన్నారు. గేమ్‌లో అతను ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడని.. ఇలాంటి టాస్క్‌లు మొత్తం తొమ్మిది ఉంటాయన్నారు. ద్వితీయార్ధంలో వచ్చే టాస్క్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. ఒక ట్రోమాలోకి వెళ్లిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా సహాయం చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్ అని తెలిపారు. 


యూత్‌ను అట్రాక్ట్ చేస్తూనే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించామన్నారు. టీజర్, ట్రైలర్‌లో రివీల్ చేయలేదని.. మధుబాల క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఆదిత్యామీనన్‌ పాత్ర చాలా స్మార్ట్ క్యారెక్టర్ అని.. సైకలాజికల్ డాక్టర్‌గా ఆయన నటించారని చెప్పారు. శుభలేఖ సుధాకర్ మరో కీలక పాత్ర పోషించారని.. నేహా సోలంకి క్యారెక్టర్ చాలా మాసీగా ఉంటుందన్నారు. నిర్మాత రవి కస్తూరికి స్క్రిప్ట్ నచ్చి తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. క్రియేటివ్ పరంగా ఆయన తనకు చాలా సపోర్ట్ చేశారని అన్నారు. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. 


Also Read: Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read: Governor Protest: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని గవర్నర్‌ ధర్నా.. మీరెందుకు అంటూ పోలీసులపై ఆగ్రహం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter