Lambasingi Trailer


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమ్మర్ సీజన్లో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని అనుకోని వారు ఎవరుంటారు. సమ్మర్ వెకేషన్ వస్తోంది అంటే ఫ్యామిలీ మొత్తం లేదా ఫ్రెండ్స్ అంతా ఇలాంటి స్పాట్స్ కి వెళ్లాలని కోరుతూ ఉంటారు. ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! కానీ మన ఆంధ్రప్రదేశ్ లోనే అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. ఆ ప్రదేశమే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరి లో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది.


ఈ టైటిల్ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచగా ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ అంచనాలను మరింత పెంచుతుంది.
ఈ సినిమా ద్వారా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమాని ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ లవ్ స్టోరీ కి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక. 


ఈ మధ్యనే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ఎంతో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ని డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆహ్లాదకంగా సాగుతూ ప్రేక్షకులను ఎంతలానో మెప్పించేలా కనిపిస్తోంది.


 



ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ ప్రజెంట్ చేస్తున్నారు అనగానే ఈ సినిమాని నా సొంత సినిమాల భావించాను. ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దివి కి అలాగే భరత్ రాజ్ కు ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకుని రావాలని. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.


ఈ సినిమాలో భరత్ రాజ్, దివి తో  పాటు వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్, జనార్దన్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కె.బుజ్జి కెమెరా మాన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ధ్రువం సంగీతం అందిస్తుండగా కే విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.


Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook