Aadi Sai Kumar Top Gear Teaser ఆది సాయి కుమార్ కొత్త కథలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది వరుసగా చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే అతిథి దేవో భవ, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ పలకరించాడు. ఇప్పుడు టాప్ గేర్ అంటూ రాబోతోన్నాడు. ఈ మూవీ డిసెంబర్ నెలలోనే థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ పెంచేసింది చిత్రయూనిట్. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాప్ గేర్ సినిమాను కె.శశికాంత్ తెరకెక్కిస్తుండగా.. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే టాప్ గేర్ అంటూ ఇది వరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, సిధ్ శ్రీరామ్ పాడిన వెన్నెల పాటకు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ట్రేడ్ సర్కిళ్లలో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.


అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. ఈ మూవీ టీజర్‌ను డిసెంబర్‌ 3న విడుదల చేయబోతోన్నారు. ఉదయం పదకొండు గంటలకు ఈ టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేయబోతోన్నాడట. ఈ మేరకు చిత్రయూనిట్ అప్డేట్ వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది గన్ పట్టుకుని సీరియస్‌గా గురి పెట్టేసి ఉన్నాడు.


ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆది పక్కన రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చమ్మక్ చంద్ర, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, మీమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

Also Read : Poonam Kaur fibromyalgia : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. ఇంతగా బాధపడుతోందా?.. అసలేం జరిగిందంటే?


Also Read : Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook