Director Shankar Son In Law Rohit: తమిళ డైరెక్టర్​ శంకర్​ అల్లుడు, క్రికెటర్​ రోహిత్​పై(Rohit Samodaran Pondicherry) పాండిచ్చేరిలో పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. పాండిచ్చేరి క్రికెట్​ క్లబ్​లో శిక్షణ కోసం వచ్చిన 16 ఏళ్ల అమ్మాయిని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణల కారణంగా డైరెక్టర్​ శంకర్​ అల్లుడు(Director Shankar Son In Law) రోహిత్​తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?
పాండిచ్చేరికి చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి క్రికెట్​ శిక్షణ కోసం అక్కడి క్రికెట్​ క్లబ్​కు(Pondicherry Cricket Club) వెళ్లింది. అందులోని కోచ్​ తమరై కణ్ణన్​ లైంగికంగా వేధింపులకు గురి చేస్తుండగా.. ఆమె క్రికెట్​ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై విచారణ చేయాల్సిన క్రికెట్​ బోర్డు అధికారులే.. కోచ్​తో గొడవ పడదొద్దని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో సదరు బాలిక చిల్డ్రన్స్​ వెల్ఫేర్​ కమిటీని ఆశ్రయించి.. కోచ్​ తమరై కణ్ణన్​(Cricket Coach Karamayi Kannan) తనను లైంగికంగా వేధిస్తున్నాడని వివరించింది. ఆ బాలిక మనోవేదనను గుర్తించిన చిల్డ్రన్స్​ వెల్ఫేర్​ కమిటీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ క్రికెట్​ క్లబ్​కు చెందిన కోచ్​ తమరై కణ్ణన్​తో పాటు క్రికెట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ దామోదరన్​, సెక్రటరీ వెంకట్​, ఆ క్లబ్​ జట్టు కెప్టెన్​ రోహిత్​ (డైరెక్టర్​ శంకర్​ అల్లుడు) (Rohit Damodaran News) సహా పలువురిపై పోక్సో చట్టం(Pocso Act) కింద లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. దీనికి కారణమైన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


అయితే ఈ కేసులో డైరెక్టర్​ శంకర్​ అల్లుడు రోహిత్​ పాత్ర ఉండడం వల్ల కోలీవుడ్​ ఫ్యాన్స్​ షాక్​కు గురయ్యారు. ఈ ఆరోపణల నుంచి రోహిత్​ త్వరలోనే విముక్తి పొందుతాడని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు దేశవాళీ క్రికెట్​ జట్టుకు చెందిన​ రోహిత్​ దామోదరన్​.. కోలీవుడ్​ డైరెక్టర్​ శంకర్​ పెద్ద కుమార్తె ఐశ్వర్యను(Rohit Damodaran Wife) ఈ ఏడాది జులై 27న పెళ్లి(Rohith Damodaran Marriage) చేసుకున్నాడు. 


కోలీవుడ్​ డైరెక్టర్​ శంకర్​ ప్రస్తుతం మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​తో(Ram Charan Shankar Movie) ఓ పాన్​ ఇండియా సినిమాతో పాటు బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​తో 'అన్నియన్​' రీమేక్​(Anniyan Remake) చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.