Director Teja Reveals Uday Kiran Death Secret: హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆయన యూత్ హీరోగా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నారు. చిత్రం నువ్వు నేను సహా లాంటి సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తరువాత కూడా మనసంతా నువ్వే లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇక ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత కాలంలో అసలు సినిమా కూడా లేక ఇబ్బంది పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్నాళ్ల పాటు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైపోయిన ఉదయ్ కిరణ్ తర్వాత విషిత అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక అంతా బాగానే ఉంది సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటున్న సమయంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం తెలుగు వారందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఉదయ్ కిరణ్తో ప్రత్యేక అనుబంధం కలిగిన దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ మరణం ఎందుకు సంభవించిందో తనకు తెలుసని కామెంట్ చేశారు. ఉదయ్ కిరణ్ తనతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నారని దర్శకుడు తేజ వెల్లడించారు.


తాజాగా జీ తెలుగు న్యూస్ కి ఇచ్చిన ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేజ బయట పెట్టారు. అసలు ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగింది అనే విషయం తనకు తెలుసని చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఉదయ్ కిరణ్ తనకు ఈ విషయాన్ని వెల్లడించారని తేజ చెప్పుకొచ్చారు. నిజానికి ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారు అనే విషయం మీద సరైన క్లారిటీ ఎవరికీ లేదు. ఆయన ఒకప్పుడు స్టార్ హీరోగా అనేక సినిమాలు చేసి తర్వాత పూర్తిగా అసలు సినిమాలే దూరమైపోవడంతో సెలబ్రిటీ హోదాని మిస్ అయ్యి ఆ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకుని చనిపోయినట్లుగా ఒక ప్రచారం జరిగితే కుటుంబంలో భార్యతో ఉన్న సమస్యల వల్లే చనిపోయినట్లుగా మరికొంత ప్రచారం జరిగింది.


ఇదే విషయం మీద దర్శకుడు తేజ మాట్లాడుతూ తనకు అన్ని విషయాలు తెలుసు కానీ బయట పెట్టనని అన్నారు. ఇకఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆ తప్పు చేసే ధైర్యం కూడా తనకు లేదని చెప్పుకొచ్చారు. ఇక తాను చనిపోయే లోపు ఏదో ఒక సమయంలో ఈ విషయాన్ని బయట పెడతాను కానీ ఇప్పుడు మాత్రం అది బయట పెట్టనని తేజ చెప్పుకొచ్చారు.


Also Read: Director Teja - Pooja Hegde: పూజా హెగ్డే ఎవరు? నాకు తెలీదే!.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!


Also Read: Vishwak Sen on Arjun Sarja: అన్నీ అర్జున్ చెప్పినట్టే జరగాలా? అందుకే సినిమా నుంచి తప్పుకున్నానంటూ విశ్వక్ సేన్ సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook