నాకు ఆ పిట్టకథ తెలుసు: త్రివిక్రమ్ శ్రీనివాస్
Trivikram srinivas | టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన వారసుడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఓ పిట్టకథ అనే సినిమాతో బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైంది.
నటుడు బ్రహ్మాజీ అంటే తెలియని వాళ్లు టాలీవుడ్‌లో ఎవరూ ఉండరు. బ్రహ్మాజీ తన కుమారుడు సంజయ్‌ని వెండితెరకు పరిచయం చేయనున్నారు. చందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘ఓ.. పిట్టకథ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. ఈ పిట్టకథ తనకు తెలుసునని, చాలా నచ్చిందన్నారు దర్శకుడు త్రివిక్రమ్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Also Read: ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’.. సుడిగాలి సుదీర్ బాటలో యాంకర్ ప్రదీప్
పల్లెటూరి నేపథ్యంగా వస్తోన్న ఈ సినిమాలో విశ్వంత్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, సంజయ్‌రావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓ పిట్టకథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో నాకు చిన్న లింక్ ఉంది. ఆ కథ నాకు తెలియడమే ఆ లింక్. దర్శకుడు చందుకు ఆలోచన వచ్చిన రెండు, మూడు టైటిల్స్‌లో ఓ పిట్టకథ పేరు బాగా నచ్చింది. దాంతో ఆ పేరును ఖరారు చేయమని సలహా ఇచ్చాను. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో టైటిల్ సూచించడంతో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశానని’ తెలిపారు.
[[{"fid":"181424","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Courtesy: Twitter/BRAHMAJI","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Courtesy: Twitter/BRAHMAJI","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Courtesy: Twitter/BRAHMAJI","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
‘నందమూరి బాలకృష్ణతో ‘పైసా వసూల్’, గోపీచంద్‌తో ‘శౌర్యం2, ‘లౌక్యం’,‘సౌఖ్యం’ లాంటి కమర్షియల్ సినిమాలు చేశాం. కొత్తవారిని ప్రోత్సహించాలని భావించి దర్శకుడు చందుకు అవకాశమిచ్చాం. చందు చెప్పిన కథకు కనెక్ట్ అయ్యానని’ నిర్మాత ఆనంద ప్రసాద్ వివరించారు.