Balagam Director Venu బలగం సినిమా ఎంతటి ఆదరణను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో దర్శకుడు వేణుకి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు ఆయనకున్న కమెడియన్‌ ట్యాగ్ పోయింది. మంచి టాలెంట్‌ ఉన్న ఎమోషనల్ డైరెక్టర్‌గా ఆయన్ను గుర్తిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేణు ఈ సినిమాతో టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచాడు. వేణులో ఇన్ని ఎమోషన్స్ దాగి ఉన్నాయా? అని అనుకున్నారు. నవ్వించడమే కాదు..ఏడ్పించడంలోనూ వేణు తన మార్క్ వేశాడంటూ తెలంగాణ ప్రజానీకం ఆయన్ను నెత్తిన పెట్టేసుకుంది. అయితే బలగం సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగానూ అందరినీ మెప్పించింది. ఎన్నో వేదికల మీద ఎన్నో కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పుడు కానిస్టేబుల్‌ ప్రశ్నాపత్రంలో ఓ క్వశ్చన్ వచ్చింది.


Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్


బలగం సినిమాకు ఒనిక్యో ఫిల్మ్ అవార్డ్‌లో భాగంగా ఏ కేటగిరీలో అవార్డు వచ్చిందని అడిగారు. దానికి ఆప్షన్స్‌ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ సంభాషణ అని ఇచ్చారు. అయితే ఉత్తమ నాటకం కేటగిరీలో బలగం సినిమాకు అవార్డు వచ్చింది. ఇలాంటి అవార్డులు బలగం సినిమాకు లెక్కలేనన్ని వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు.. అవార్డులను కొల్లగొట్టడంలోనూ రికార్డులు క్రియేట్ చేసింది.


 



ఇక ఇలా తన సినిమాకు సంబంధించిన ప్రశ్న కానిస్టేబుల్ పేపర్‌లో రావడం మీద వేణు స్పందించాడు. గుడ్ మార్నింగ్.. ఓ ఫ్రెండ్ నాకు ఇది పంపించాడు.. నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది.. తెలుగు ఆడియెన్స్ అందరికీ థాంక్స్.. నా కలను నెరవేర్చారు అంటూ అందరికీ దండం పెట్టేశాడు. వేణు ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook