Diwali Release Movies 2021, List of Diwali Theaters OTT Release Telugu Movies: దీపావళికి చాలా సినిమాలే విడుదల కానున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజ్‌ కానుండగా.. మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో (OTT Platforms) విడుదల కానున్నాయి. మాస్‌ డైరెక్టర్‌ శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన తమిళ మూవీ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్న..గా (Peddanna) ఈ దీపావళి (Diwali) కానుకగా నవంబరు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఇటీవల విడుదలైన రజనీకాంత్‌ (Rajinikanth‌) పెద్దన్న టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంది. సిస్టర్‌ సెంటిమెంట్‌కు తోడు రజనీ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని కమర్షియల్‌ హంగులతో పెద్దన్నను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



విశాల్‌.. ఆర్య కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎనిమి’. (enemy) ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. మిని స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌ కుమార్‌ నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. దీపావళి (Deepavali) సందర్భంగా ఈ సినిమా కూడా తెలుగులో నవంబరు 4న థియేటర్‌లలో (Theaters) విడుదల కానుంది. 




సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా మారుతి తెరకెక్కించిన మూవీ మంచి రోజులు వచ్చాయి (Manchi Rojulu Vachayi ) దీపావళి పండగను పురస్కరించుకుని ఈ నెల 4న థియేటర్‌లలో విడుదల కానుంది. యూవీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఆద్యంతం వినోదాత్మకంగా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందని మూవీ యూనిట్ అంటోంది.



అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ చిత్రం ‘సూర్యవంశీ’ (Sooryavanshi). రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలక పాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించారు. ఈ దీపావళి కానుకగా థియేటర్‌లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Also Read : RRR Movie Glimpse: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి గ్లింప్స్ వచ్చేసింది.. వీడియో ఎలా ఉందంటే?


సూపర్‌హీరోస్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హాలీవుడ్‌. మార్వెల్‌ కామిక్స్‌ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్‌’ (Eternals ) వస్తున్నారు. నవంబరు 5న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



ఇక ఓటీటీలో రిలీజ్‌ అయ్యే సినిమాలివే..


తమిళ నటుడు సూర్య నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘జై భీమ్‌’ (Jai Bhim). తా.సే.జ్ఞానవేల్‌ దర్శకుడు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.



సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’ (Gully Rowdy). ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంస్థలు నిర్మించాయి.



వెండితెరపై మెరిసిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ (Sridevi Soda Center‌) చిత్రం.. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సుధీర్‌ బాబు, ఆనంది జంటగా నటించిన మూవీ ఇది.



Also Read : chiranjeevi: దెయ్యం​ లుక్​లో చిరంజీవి.. వీడియో వైరల్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook