Neha Shetty to act with Kiran Abbavaram in Rules Ranjan Movie: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడకపోయినా.. నేహాకు నటన, అందంకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సందీప్ కిషన్‌తో కలిసి 'గల్లీ రౌడి' చేసినా.. అది కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు. సిద్ధు జొన్నలగడ్డతో చేసిన 'డీజే టిల్లు' సినిమా నేహా శెట్టికి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో నేహా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు. డీజే టిల్లు పుణ్యమాని నేహాకు సినీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యువ హీరో కార్తికేయ సినిమాలో అవకాశం అందుకున్న ఈ కన్నడ భామకు తాజగా మరో ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రూల్స్‌ రంజన్‌ సినిమాలో డీజే టిల్లు పిల్ల హీరోయిన్‌గా ఎంపికైంది. 


'యస్ఆర్ కళ్యాణ్ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా హిట్ కొట్టడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో రూల్స్‌ రంజన్‌ సినిమా ఒకటి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎయం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.


రూల్స్‌ రంజన్‌ సినిమాలో టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా 'డీజే టిల్లు' ఫేమ్‌ నేహా శెట్టి నటిస్తోందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలోనే నేహా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. యస్ఆర్ కళ్యాణ్ మండపంతో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లుతో నేహా శెట్టి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'రూల్స్ రంజన్' చిత్రంలో నటించనుండటంతో.. ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. టిల్లు గాడి హీరోయిన్ అందాలు సినిమాకు ప్లస్ కానున్నాయి. 


Also Read: Nayanthara Conditions: నయనతార కొత్త కండీషన్‌.. ఇకపై సినిమా అవకాశాలు వచ్చేనా


Also Read: Tulsi Tea Benefits: తులసి టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook