Do You Know How Tollywood Name is Formed: టాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు కేవలం ఇండియా వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సత్తా చాటుతున్న పరిస్థితి అందరికీ తెలుసు. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో మన తెలుగు సినీ పరిశ్రమ మంచి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని సంపాదించింది. అయితే తెలుగు సినీ పరిశ్రమకు టాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఆ విషయాన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విశేషాలు కేవలం జీ తెలుగు న్యూస్ పాఠకుల కోసం మేము సేకరించినవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?
నిజానికి టాలీవుడ్ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు. అయితే బెంగాలీ సినీ పరిశ్రమ పేరు టాలీవుడ్. ఈ టాలీవుడ్ అనే పేరు టాలీ గుంజే అని బెంగాల్ లోని ఒక ప్రాంతం పేరుతో ఉద్భవించిందని అంటూ ఉంటారు. బెంగాలీ సినీ పరిశ్రమను ఇప్పటికీ టాలీవుడ్ అనే పిలుస్తారు కానీ ఆ టాలీవుడ్ ని మించి మన తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్గా ముద్ర వేసుకుంది. అయితే తెలుగు పదంలోని టీ  తీసుకుని హాలీవుడ్ ఇన్స్పిరేషన్ తో టాలీవుడ్ అని మార్చారని అంటూ ఉంటారు. 


హాలీవుడ్ కు ఆ పేరు ఎలా వచ్చింది..?
ఎక్కువగా అమెరికాలో తెరకెక్కించే ఇంగ్లీష్ సినిమాలను ఈ హాలీవుడ్ అని పిలుస్తారు. నిజానికి ఇది ఒక ప్రాంతం పేరు, ఆ ప్రాంతంలో ఎక్కువగా సినిమా స్టూడియోస్ ఉండేవి, దీంతో అనేకమంది సెలబ్రిటీలు అక్కడే సెటిల్ అయ్యారు. అలా ఆ పరిశ్రమ మొత్తానికి ఈ పేరు సెట్ అయింది. 


Also Read: Prabhas as Oldman: ముసలోడిలా మారుతున్న ప్రభాస్.. ఏం మాయ చేశాడో?


బాలీవుడ్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?
హిందీ సినీ పరిశ్రమను ఈ బాలీవుడ్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడంటే తెలుగు సినిమాలు డామినేట్ చేస్తున్నాయి కానీ ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అని ప్రపంచ వ్యాప్తంగా భావించే వారు. హిందీ సినిమాలకు ఈ బాలీవుడ్ పేరు రావడానికి కారణం, బాంబే(నేటి ముంబై) బాంబే నుంచి బా తీసుకుని హాలీవుడ్ లా పలకాలని లీవుడ్ చేర్చి బాలీవుడ్ గా మారింది. 


కోలీవుడ్  కు ఆ పేరు ఎలా వచ్చింది..?
సాధారణంగా తమిళ సినిమాలను ఈ కోలీవుడ్ అని పిలుస్తూ ఉంటారు. అలా పిలవడానికి కూడా కారణం అక్కడి ప్రాంతమే. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలోనే సినీ పరిశ్రమ ఉండేది. అలా కే అక్షరాన్ని హాలీవుడ్ స్టైల్ లో మార్చడం తో దానికి కోలీవుడ్ అనే పేరు వచ్చింది. 


మాలీవుడ్, శాండల్ వుడ్ లకు ఆ పేరు ఎలా వచింది..?
కేరళ వాసులను మల్లూ అని సంభోసడిస్తూ ఉంటారు అందుకే వారి సినిమా పరిశ్రమను మాలీవుడ్ అని పిలుస్తారు. ఇక కన్నడ సినీ పరిశ్రమను మాత్రం శాండిల్ వుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అత్యధికంగా శాండిల్ దొరుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. 


Also Read: Ravanasura Collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. భారీ డిజాస్టర్ దిశగా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook