పెళ్లికి తొందరేం లేదంటున్న హీరోయిన్
జెంటిల్‌మేన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ( Nivetha Thomas )... ఆ తర్వాత నిన్ను కోరి, దర్బార్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.
జెంటిల్‌మేన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ ( Nivetha Thomas )... ఆ తర్వాత నిన్ను కోరి, దర్బార్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. తక్కువ వ్యవధిలోనే, మంచి సినిమాలను ఎంచుకొని టాలీవుడ్‌లో ( Tollywood ) తనకంటూ మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. Also read : నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో గ్యాలరీ
నివేదా థామస్, నాని కలిసి నటించిన V మూవీ త్వరలోనే OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతుంది. ఐతే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో నివేదా థామస్ మాట్లాడుతూ.. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని స్థిరపడటానికి ఆసక్తి లేదని, అంతకంటే ముందుగా తనకు ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చింది. Also read : Sanjay Dutt: సంజయ్ దత్ గురించి వర్రీ అవుతున్న చిరంజీవి
ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచన తన మనసులో లేదంటున్న నివేదా థామస్.. అప్పుడే తన చిత్రాల దర్శకత్వం కోసం కొన్ని స్క్రిప్ట్స్ కూడా సిద్దం చేసుకుంటోందట. లాక్ డౌన్ సమయంలో నివేదా కొన్ని మంచి స్క్రిప్ట్స్ కూడా రాశానని చెప్పుకొచ్చింది. Also read : Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?