12th Man Trailer Release: దృశ్యం ఫేమ్ దర్శకుడు మరో క్రైమ్ థ్రిల్లర్ 12th Man గురించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమా ఈసారి నేరుగా ఓటీటీ రిలీజ్ కానుండటం విశేషం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటి వరకూ మళయాలంలో ఇప్పుడు దక్షిణాదిన సైతం ప్రాచుర్యం పొందిన దర్శకుడు జీతూ జోసెఫ్. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో చాలా ప్రాచుర్యం పొందిన దర్శకుడు. క్రైమ్ థిల్లర్ సినిమాలు తీయడంలో జీతూ జోసెఫ్ నిష్ణాతుడు. దృశ్యం సినిమాలు కేవలం మళయాలంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హిట్ సాధించాయి. ఇప్పుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమా సిద్ధమైంది. అదే 12th Man.ఇవాళ విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. 


మళయాల విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఇది కూడా క్రైమ్ థిల్లర్. ఓ పదకొండు మంది స్నేహితులు వెకేషన్ కు వెళ్లినప్పుడు 12వ వ్యక్తి కలుస్తాడు. అతడెవరు, మిగిలిన 11 మందితో అతనికున్న సంబంధమేంటనే విషయాలతో ఉత్కంఠంగా సాగుతుంది సినిమా. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అత్యంత ఉత్కంఠంగా ఉంది. ఈ సినిమా ధియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 20వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.


Also read: Vishwak Sen Ban: విశ్వక్ సేన్ పై మంత్రి ఆగ్రహం.. హీరోపై బ్యాన్ విధించే అవకాశం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook