Corona Third wave: తండ్రీకొడుకులైన స్టార్ హీరోలకు వారం గ్యాప్‌లో కొవిడ్ పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా థార్డ్ వేవ్ ఉద్ధృతంగా (Corona Third wave) కొనసాగుతోంది. కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. తాజాగా కొవిడ్ సోకిన సెలబ్రెటీల జాబితాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ చేరారు.
Corona Third wave: దేశవ్యాప్తంగా కరోనా థార్డ్ వేవ్ ఉద్ధృతంగా (Corona Third wave) కొనసాగుతోంది. కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. తాజాగా కొవిడ్ సోకిన సెలబ్రెటీల జాబితాలో మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ చేరారు.
తనకు కరోనా సోకిన విషయాన్ని దుల్కర్ సల్మాన్ స్వయంగా (Dulquer Salmaan tests Corona positive) ట్విట్టర్ ద్వారా వెల్లడిచారు.
వాళ్లు సేఫ్‌గా ఉండాలని విజ్ఞప్తి..
'నాకు ఇప్పడే కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. స్వల్ప లక్షణాలు మినహా.. పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను.
షూటింగ్‌లు సహా వివిధ కారణాలతో ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా తగిన జాగ్రత్తలు పాటించండి.' అని ట్వీట్ చేశారు దుల్కర్ సల్మాన్.
ఇటీవలే మమ్ముట్టికి కొవిడ్..
ఇటీవలే దుల్కర్ సల్మాన్ తండ్రి, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడ్డారు. గత వారమే ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా (Mammootty tested Corona positive) తేలింది. ఆయన కూడా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. కేవలం వారం రోజుల్లో తండ్రి, కొడుకులు ఇద్దరూ కరోనా బారిన పడటంతో అటు ఫ్యామిలీ సభ్యులు, ఇటు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో తెలుగు, హిందీ, తమిళం భాషల సనీ ప్రముఖులు పెద్ద ఎత్తున కరోనా బారిన (Covid 19 in Film industry) పడ్డారు.
Also read: Vishwak Sen Film: ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా? అంటున్న విశ్వక్ సెన్..!
Also read: Hansika Motwani Photo: అందాల భామ హన్సిక ఏంటి ఇలా మారిపోయింది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook