BB 7 Telugu: బిగ్ బాస్‌లో ఘనంగా దసరా, బతుకమ్మ సంబరాలు.. ఎపిసోడ్ టైమింగ్ ఛేంజ్..
BB 7 Telugu: బిగ్‌బాస్ లో ఇవాళ మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. హౌస్ లో దసరా సంబరాలతోపాటు స్టేజ్ మీద సెలిబ్రిటీల డ్యాన్స్ లతో బిగ్ బాస్ సందడి సందడిగా మారనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
Bigg Boss 7 Telugu today Episode Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 వీకెండ్ ఎపిసోడ్ కు వేళాయింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఫన్నీ గేమ్స్, చిట్ చాట్స్, సరదా టాస్కులతో షో ను రక్తి కట్టిస్తారు నాగార్జున. అయితే ఈ సండే మరితం స్పెషల్ కానుంది. ఎందుకంటే దసరా, బతుకమ్మ పండుగలు ఇదే రోజు వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబంరాలు ఘనంగా జరిగినట్లు ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాకుండా సెలబ్రిటీలతో డ్యాన్స్ లు కూడా చేయించినట్లు ప్రోమోలు చూపించారు. ఫెస్టివల్ సందర్భంగా సాయంత్రం 07 గంటల నుంచే బిగ్ బాస్ మెగా ఎపిసోడ్ ప్రసారం కానుంది.
తాజా ప్రోమోలో ఏముందంటే.. ముందుగా నాగార్జున కంటెస్టెంట్లకు దసరా శుభకాంక్షలు చెప్పారు. అనంతరం శోభాశెట్టి, ప్రియాంకతో నాగినీ డ్యాన్స్ చేయించారు నాగ్. అనంతరం అర్జున్, అశ్వినీతో పోల్ డ్యాన్స్ వేయించారు. ఆ తర్వాత తమ తమ కుటుంబాల నుంచి వచ్చిన ఉత్తరాలను కంటెస్టెంట్లకు ఇచ్చారు బిగ్ బాస్. లెటర్స్ ను చదువుతూ కొందరు కంటెస్టెంట్లు కన్నీటి పర్యంతమయ్యారు. శోభాశెట్టి అయితే గుక్కపట్టి ఏడ్చింది. యావర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని శివాజీ ఓదార్చాడు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓట్లను గుర్తుచేశాడు కింగ్. దీంతో ప్రోమో ముగుస్తుంది. లీకైన సమాచారం ప్రకారం, రతికా రోజ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దసరా సంబంరాలు ఎలా జరిగాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
మరోవైపు ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. వారే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, గౌతమ్, టేస్టీతేజా, అశ్వినీ, పూజా మూర్తి, భోలే షావలి. ఇక ఓటింగ్ విషయానికొస్తే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు అత్యధిక ఓట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు. రెండు, మూడు స్థానాల్లో అమర్, గౌతమ్ ఉన్నారు. చివరి రెండు స్థానంలో అశ్విని శ్రీ, పూజా మూర్తి ఉన్నారు. ఈ వారం పూజా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Skanda OTT: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook