ఈ మాయ పేరేమిటో మూవీ రివ్యూ
ఈ మాయ పేరేమిటో మూవీ రివ్యూ
నటీనటులు : రాహుల్ విజయ్, కావ్యా థాపర్ , రాజేంద్రప్రసాద్, మురళీశర్మ తదితరులు
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : శ్యాం కె.నాయుడు
ఫైట్స్ : విజయ్
ఎడిటర్ : నవీన్ నూలి
నిర్మాత : దివ్యా విజయ్
దర్శకత్వం : రాము కొప్పుల.
విడుదల తేది : 21 సెప్టెంబర్ 2018
ప్రతీ వారం కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటాయి. ఈ వారం కూడా అదే తరహాలో కొన్ని సినిమాలతో పాటు ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్ శిష్యుడు రాము కొప్పుల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరి రాము కొప్పుల తన డైరెక్షన్‌తో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసాడా ? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
వైజాగ్‌లో వ్యాపార వేత్తగా సెటిల్ అయిన ప్రమోద్ జైన్(మురళి శర్మ) తన కూతురు శీతల్ జైన్(కావ్య థాపర్)ను అల్లారుముద్దుగా పెంచుతాడు. ఇక అల్లరిచిల్లరిగా తిరుగుతూ తన బిహేవియర్‌తో అందరితో మంచోడు అనిపించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు చందు(రాహుల్ విజయ్). అయితే ఒకానొక సందర్భంలో ఎదుటివారికి సహయపడే తనలాంటి గుణం ఉన్న చందుని చూసి శీతల్ అతడితో ప్రేమలో పడిపోతుంది. అలా చందు ప్రేమలో పడిన శీతల్ ఆ విషయాన్నీ చందూకి చెప్పకుండా అతనికి తెలియకుండా ఫాలో అవుతుంది. శీతల్ తనను అమితంగా ప్రేమిస్తోందనే సంగతి తెలుసుకున్న చందు అప్పటి నుండి శీతల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే ఇంట్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ చందులో మార్పును తీసుకొస్తుంది. ఆ మార్పు చూసి ప్రమోద్ జైన్ చందుని అల్లుడిగా ఒప్పుకుంటాడు. అయితే అనుకోకుండా చందును శీతల్ తిరస్కరిస్తుంది. తన తండ్రి తర్వాత అంతగా ఇష్టపడిన చందును శీతల్ ఎందుకు రిజెక్ట్ చేసింది ? చివరికి చందు, శీతల్ ఎలా ఒకటయ్యారు ? అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు:
నటుడిగా తనకు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ రాహుల్ విజయ్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. ముఖ్యంగా డాన్స్, ఫైట్స్ విషయంలో చాలా మెస్మరైజ్ చేసాడు. కాకపోతే ఎమోషనల్ సీన్స్‌లో రాహుల్ తేలిపోయాడు. కావ్య థాపర్ కూడా తనకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్‌తో క్యారెక్టర్‌కి బెస్ట్ అనిపించుకుంది. గ్లామర్‌తో కూడా ఆకట్టుకుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, ఈశ్వరి రావు లాంటి సీనియర్ ఆర్టిస్టులు తమ క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, కామెడి వర్కౌట్ అవ్వలేదు. రాళ్ళపల్లి, పోసాని, కాదంబరి కిరణ్, జోష్ రవి తదితరులు పరవాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు :
మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘మంచి పేరు’, ’నాలో నేను’, ’అరి హంతనం’ పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. శ్యాం కే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తన కెమెరా వర్క్‌తో విజువల్‌గా ఎట్రాక్ట్ చేసాడు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ పరవాలేదు. శ్రీమణి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాము కొప్పుల కథ, స్క్రీన్ ప్లే రొటీన్ అనిపించాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే డైలాగ్స్ అలరించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నిర్మాతల తనయులు, దర్శకుల తనయులు హీరోలు అవ్వడం షరా మామూలే. ఓ ఫైట్ మాస్టర్ కొడుకు హీరోగా మారడం అన్నది కాస్త కొత్తే. ముప్పై ఏళ్లుగా సినీ రంగంలో ఫైట్ మాస్టర్‌గా పనిచేస్తున్న విజయ్ మాస్టర్ తన తనయుడు… రాహుల్‌ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేసాడు. ఇక విజయ్ మాస్టర్‌తో అనుబంధం ఉన్న స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్ రాహుల్ డెబ్యూ సినిమాను తమ వంతుగా ప్రమోట్ చేస్తూ వచ్చారు.
సినిమా విషయానికొస్తే.. సినిమాకి ఆయువుపట్టు అనేది కథే. బలమైన కథకి బలమైన సన్నివేశాలు రాసుకుంటే ప్రేక్షకులను మెప్పించడం చాలా సులువు. సరిగ్గా ఇక్కడే దర్శకుడు రాము కొప్పుల ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా కోసం ఆడియన్స్‌కి ఎప్పుడో బోర్ కొట్టేసిన రొటీన్ కథనే ఎంచుకోవడం దానికి సరైన స్క్రీన్ ప్లే, బలమైన సన్నివేశాలు రాసుకోకపోవడంతో సినిమా తేడా కొట్టింది. తన డెబ్యూ సినిమాకు టాలెంట్ ఉన్న హీరో హీరోయిన్ దొరికారు.. కానీ ఈ వీక్ స్టోరీతో సినిమాను ముందుకు నడిపించడంలో రాము తడబడ్డాడు. రొటీన్ కథ కావడంతో హీరో హీరోయిన్, సీనియర్ ఆర్టిస్టులు కూడా ఏం చేయలేకపోయారు. నాని వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం, ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
సినిమా చూస్తున్నంత సేపు ఏదో సాగుతుందిలే.. అన్నట్టుగా ప్రేక్షకుడు ఫీలవుతాడు. మరీ ముఖ్యంగా ఈ రొటీన్ డ్రామాను కాస్త సాగదీస్తూ చెప్పడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. కమెడియన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వారిని కామెడి యాంగిల్‌లో వాడుకోలేకపోయాడు. ఇలాంటి కథతో హీరోగా పరిచయం అవ్వడం అనేది రాహుల్ రాంగ్ ఛాయస్ అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమా రాహుల్ విజయ్‌కి ఓ షో రీల్‌లా ఉపయోగపడుతుంది. సినిమా ప్రారంభం నుండి ఏదో చెయ్యాలనే తపన అతనిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతీ సాంగ్‌లో తన డాన్స్ టాలెంట్‌ను చూపించాలని ఆరాటపడ్డాడు. ఇక ఫైట్ మాస్టర్ కొడుకు కాబట్టి ఫైట్స్ కూడా చాలా ఈజీగానే చేసేశాడు.
రొటీన్ కథ – స్క్రీన్ ప్లే, కామెడి లేకపోవడం, లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ పండకపోవడం, క్లైమాక్స్… సినిమాలో మైనస్ పాయింట్స్ కాగా…. హీరో రాహుల్ పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్, సాంగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్.
రేటింగ్ : 2 /5