Radhe Shyam New Song: రాధేశ్యామ్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. ఫిదా అవుతున్న ఫాన్స్!!
Radhe Shyam Ee Raathale Full Video Song: రాధేశ్యామ్ సినిమా నుంచి తాజాగా `ఈ రాతలే` ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. `ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో వీడిపోని యాత్రికులా` అంటూ సాంగ్ మొదలవుతుంది.
Ee Raathale Full Video Song out from Radhe Shyam Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథతో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వేసవి కానుకగా ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.
రాధేశ్యామ్ సినిమా నుంచి ఇప్పటికే 'ఈ రాతలే' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో వీడిపోని యాత్రికులా' అంటూ సాంగ్ మొదలవుతుంది. ఈ మెలోడీ పాటకు జస్టిస్ శంకర్ మ్యూజిక్ అందించగా.. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. పాటను బట్టి చూస్తే.. ప్రభాస్, పూజా హెగ్డేలు కలిసేట్టు లేరు. ఈ రాతలే పాటకు ఫాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు.
'ఈ రాతలే' ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. రెండు గంటల క్రితం విడుదల అయిన ఈ పాటకు 643,057 వ్యూస్ వచ్చాయి. పాటలోని అందమైన లొకేషన్లకు ఎందరూ మంత్రముగ్దులవుతున్నారు. ఇక ఈ వీడియో పాటను హీరోయిన్ పూజా హెగ్డే కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'హృదయాలు కలిస్తే రాగం పుడుతుంది. మీకు ఈ రొమాంటిక్ ట్రీట్‌ను అందిస్తున్నా' అంటూ కాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అయింది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ చూసి ఆస్వాదించండి.
Also Read: Bheemla Nayak Review: భీమ్లా నాయక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook