Viral Entertainment News: నటన, డాన్స్ తో బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు గోవిందా గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఈయన హీరో గానే కాకుండా సహాయ నటుడిగా, కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు గోవిందా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా ఈయన సతీమణి సునీత తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో తన భర్త గురించి మాట్లాడింది.  ఆయనను కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు అంటూ చెప్పుకొచ్చింది. సునీత మాట్లాడుతూ.. కెరియర్ పరంగా ఉన్నత దశలో ఉన్నప్పుడు గోవిందా కి ఎంతోమంది అభిమానులు ఉండేవారు.. ఆయనకున్న ఫాలోయింగ్ చూసి నేను కూడా సంబరపడిపోయేదాన్ని. 


ముఖ్యంగా ఆయనను కలవడానికి,  చూడడానికి అభిమానులు విచిత్రమైన పనులు కూడా చేసేవారు. అలా జరిగిన ఒక సంఘటన నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అంటూ సునీత తెలిపింది. సునీత మాట్లాడుతూ మాకు పెళ్లయిన కొత్తలో ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇంట్లో పనుల్లో సహాయం చేస్తానని పనిమనిషిగా చేరింది.20 రోజులు మాతోనే ఉంది. నిజానికి ఆమెకు ఇల్లు క్లీన్ చేయడమే కాదు అసలు గిన్నెలు శుభ్రం చేయడం కూడా రాదు. 


షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చే ఆయనను చూడడం కోసమే ఆమె నిద్ర కూడా మానుకునేది. ఆమె రూపురేఖలు , ప్రవర్తన అన్ని చూస్తే ధనవంతుల అమ్మాయి లాగా అనిపించింది. ఒకరోజు ఇదే విషయాన్ని నేను మా అత్తయ్యతో చెబితే,  చివరికి ఆమె ఒక మంత్రి కుమార్తె అని తెలిసింది. 


అయితే ఇదే విషయంపై మేము ఆమెను ప్రశ్నించగా.. ఆమె కన్నీరు పెట్టుకొని,  నా భర్తకు ఆమె వీరాభిమానిని అని తెలిపింది. ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాము. దాంతో ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్ లతో మా ఇంటికి వచ్చేసరికి మేము ఆశ్చర్యపోయాము అంటూ తెలిపింది సునీత. మొత్తానికైతే గోవిందా ను కలవడానికి ఒక మంత్రి కూతురు పనిమనిషిగా వారింట్లో చేరడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు. గోవిందా లవ్ 86 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, హత్య, రాజబాబు, హీరో నంబర్ వన్, కిస్మత్, బ్రహ్మ,  రాజాజీ వంటి ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.


Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.