ఎవ్వరికీ చెప్పొద్దు టీజర్
ఎవ్వరికీ చెప్పొద్దు మూవీ టీజర్
బాహుబలి 2 సినిమాలో సేతుపతి పాత్రలో నటించిన రాకేశ్ వర్రే హీరోగా 'ఎవరికీ చెప్పొద్దు' అనే చిత్రం తెరకెక్కుతోంది. బసవ శంకర్ అనే ఓ కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాకేశ్ వర్రె సరసన గార్గేయ ఎల్లాప్రగడ జంటగా నటిస్తోంది. క్రేజీ ఆంట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నటుడు రాకేశ్ వర్రే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శంకర్ శర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రాకేశ్ వర్రె హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు.