F3 First Lyrical Song: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 3'. గతంలో విడుదలైన 'ఎఫ్ 2' సినిమాకు ఇది సీక్వెల్. సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' సినిమాకు ప్రేక్షకుల నుంచి నుంచి విపరీతమైన స్పందన లభించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ నటన ఫ్యాన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. 'ఎఫ్ 2'కు మూడు రెట్లు ఎక్కువ వినోదంతో ఈ సీక్వెల్ 'ఎఫ్ 3' సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయిస్తూ ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు. జనవరిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతుంది.  


ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. దీంతో ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ 'లబ్ లబ్ లబ్ లబ్ డబ్బు' ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. 



'ఎఫ్ 2' సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు.  


Also Read: F3 movie songs: 'ఎఫ్ 3' అప్ డేట్.. 'లబ్‌ డబ్‌ లబ్‌ డబ్ డబ్బు' సాంగ్ ప్రోమో రిలీజ్


Also Read: Kangna Sharma Hot Pics: బోల్డ్‌నెస్‌లో తగ్గేది లేదంటున్న కంగనా శర్మ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook