F3 Movie new release date: వెంకటేశ్ (Venkatesh), వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎఫ్ 3' (F3 movie). ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్​గా వస్తున్న ఈ సినిమాను డబ్బు నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో సునీల్ కీలకపాత్రలో నటించారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. సోనాల్ చౌహాన్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాను సమ్మర్ బరిలో దింపనున్నారు. మే 27న ఈ సినిమాను (F3 movie new release date) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి.. ఫన్‌ పిక్నిక్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశాం.. మే 27న ఎఫ్‌3 రాబోతుంది. ఇంక డేట్‌ మార్చే ప్రసక్తే లేదు' అని అధికారికంగా ప్రకటించారు. అయితే ఏప్రిల్‌ 29న ఆచార్య విడుదల అవుతోంది. తాజాగా ఎఫ్‌ 3 రిలీజ్‌ డేట్‌ను మార్చటంతో.. రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్‌ తప్పినట్లైంది.



Also Read: Khiladi: వివాదంలో రవితేజ 'ఖిలాడీ'.. సినిమాపై కోర్టుకెక్కిన బాలీవుడ్ నిర్మాత...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook