F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత
![F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/05/27/232708-f3-movie-review-and-rating.jpg?itok=zqxIRym7)
F3 Movie review and rating: లాంగ్ వెయిటెడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 3 బొమ్మ అదిరినట్టుంది. సినిమా మొత్తం నవ్వులు పూయించిందటూ ట్విట్టర్ అంతా మార్మోగుతోంది. ఎ బిగ్ ఎంటర్‌టైనర్ అంటూ కితాబిస్తున్నారు.
F3 Movie review and rating: లాంగ్ వెయిటెడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 3 బొమ్మ అదిరినట్టుంది. సినిమా మొత్తం నవ్వులు పూయించిందటూ ట్విట్టర్ అంతా మార్మోగుతోంది. ఎ బిగ్ ఎంటర్‌టైనర్ అంటూ కితాబిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పీర్జాదాలు కలిసి నటించిన మెగా ఫ్యామిటీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 3 సినిమా నిజంగానే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇవాళ విడుదలై బొమ్మ అదిరిందనే టాక్ తెచ్చుకుంది. సినిమా ఆద్యంతం నవ్వులు పూయించిందంటూ ట్విట్టర్ రివ్యూలు వస్తున్నాయి.
సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారని..ఫన్ క్రాకర్స్ వెలుగుతూనే ఉంటాయని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. వెళ్లి నవ్వుకుని రండమ్మా అంటున్నారు. ఇంకొందరైతే ఫస్ట్ హాఫ్ అదిరిందని చెబుతున్నారు ఇక ఎఫ్ 3 సినిమా ఓవర్ ది
టాప్ ఎంటర్‌టైనర్ అని.. వెంకటేశ్ టైమింగ్ బాగుందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్‌లో వెంకటేశ్, వరుణ్ తేజ్ అభిమానులకు పూనకాలేనంటున్నారు. ఎఫ్ 3 సినిమా అసలు రివ్యూలతో ఆడే సినిమా కాదని..రెవిన్యూ తీసుకొచ్చే పిక్చర్ అంటున్నారు. ఎఫ్ 2 కూడా రివ్యూల్ని కాదని..అదరగొట్టిందనే వాస్తవాన్ని ఇంకొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఓవరాల్‌గా సినిమాకు 3 వరకూ రేటింగ్ ఇస్తున్నారు.
ఎక్కువమంది ఫస్ట్ హాఫ్ అదిరిందని చెబుతున్నారు. ముఖ్యంగా రేచీకటి క్యారెక్టర్‌లో వెంకటేశ్ అదరగొడితే..నత్తి క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేశాడంటున్నారు. సినిమాలోని అన్నిభాగాల్లో ఈవీవీ గుర్తొచ్చారని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతలా ఎప్పుడూ నవ్వలేదంటున్నారు.
Also read: Pawan Kalyan in F3: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి