F3 movie trailer release date Update: విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్‌ 3'(F3 Movie). క్రేజీ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్‌ చౌహాన్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 'లబ్ డబ్...', 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్స్ కు అయితే మంచి వ్యూస్ వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ మే 9న ((F3 movie Trailer On May 9) రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 'ఎఫ్2'కి సీక్వెల్​గా తెరకెక్కుతుంది. 'ఎఫ్2'ను మించిన వినోదాన్ని ఈ చిత్రం ద్వారా అందించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 



Also Read: Hit 2 Release Date: హిట్ 2 సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook