F3 Movie Songs: `ఎఫ్ 3` నుంచి `ఊ ఆ ఆహా ఆహా` లిరికల్ సాంగ్ వచ్చేసింది!
F3 Songs: అనిల్ రావిపూడి తెరకెక్కుస్తున్న `ఎఫ్ 3` మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. వెంకటేష్, వరుణ్ తమ మాసీ డ్యాన్స్ లతో అదరగొట్టారు. తమన్నా, మెహరీన్ గ్లామర్ తో కట్టిపడేశారు.
F3 Movie second single Lyrical song released: విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'(F3 Movie). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, తొలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లలో భాగంగా...ఇవాళ చిత్రయూనిట్ సెకండ్ సింగిల్ 'ఊ ఆ ఆహా ఆహా' పాటను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ తన గ్లామర్ తో కట్టిపడేశారు. ఇక వెంకటేశ్, వరుణ్ తేజ్(Varun Tej) డ్యాన్స్ లతో ఇరగొట్టారు. అలాగే సునీల్ తన స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాటలో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం విశేషం. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటను సునిధి చౌహాన్, లవిత లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్ కలిసి దీన్ని ఆలపించారు. కసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు.'ఎఫ్ 2'కు మించిన వినోదాన్ని పంచేందుకు 'ఎఫ్ 3'తో సిద్ధమయ్యింది అనిల్ రావిపూడి బృందం.
Also Read: Movies Releasing This Week: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook