F3 Movie Release Date: విక్టరీ వెంకటేష్​, మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్​ 2' (ఫన్​ అండ్​ ఫస్ట్రేషన్​). 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్​గా 'ఎఫ్ 3' సినిమాను (F2 Movie Sequel) రూపొందిస్తున్నారు డైరెక్టర్​ అనిల్​ రావిపూడి (F3 Movie Director). ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్లలో రిలీజ్​ (F3 Movie Release Date) చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ​  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ' అనే క్యాప్షన్​తో ఆదివారం ఓ పోస్టర్​ను (F3 Telugu Movie Poster) విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా చూస్తే నవ్వులు గ్యారెంటీ అంటూ ట్యాగ్​తో రిలీజ్​ డేట్​ను ప్రకటించింది.  


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్​ 3' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొత్తం ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాంబినేషన్‌గా ఉంటుంది. ఇందులో వెంకటేష్​ (F3 Venkatesh Movie), వరుణ్ తేజ్ (Varun Tej News) సరసన తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు.  


Also Read: Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్​.. అక్టోబరు జీతాల్లో కోత!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook