Pushpa Trailer: పుష్ప ట్రైలర్ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!
పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో దర్శకనిర్మాతలు సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకున్నా.. కొంతమందికి మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Netizens trolls Allu Arjun's Pushpa Trailer: టాలీవుడ్ 'స్టయిలిష్ స్టార్' అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్' (Pushpa). మరో రెండు రోజుల్లో మొదటి భాగం షూటింగ్ పూర్తిచేసుకోనున్న ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల మందుకు రానుంది. బన్నీ సరసన రష్మిక మందాన్న (Rashmika) హీరోయిన్గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో దర్శకనిర్మాతలు ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఈ క్రమంలోనే సోమవారం పుష్ప ట్రైలర్ (Pushpa Trailer)ను విడుదల చేశారు.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. 'ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది', 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా.. ఫైర్' అంటూ అల్లు అర్జున్ డైలాగ్స్ చెప్పారు. మొత్తానికి బన్నీ ..పుష్పరాజ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక రష్మిక, సునీల్ కూడా తమ మాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఈ ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకున్నా.. కొంతమందికి మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
'పుష్ప ట్రైలర్ నిరాశపరిచింది.. ఊహించినంతగా లేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ట్రైలర్ నా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కాలేదు' అని ఇంకొకరు కామెంట్ చేశారు. పుష్ప ట్రైలర్‌ను కొందరు కేజీఎఫ్ ట్రైలర్‌తో పోల్చారు. కేజీఎఫ్ >>> పుష్ప అంటూ ట్వీట్ చేశారు. 'ట్రైలర్ రెండు సార్లు చూసాను. జనాలకు తెలిసిన విషయాన్ని, లీక్ అయిన క్లిప్స్ చూపించారు. ఇది మంది ఐడియానే. కానీ ట్రైలర్ ఊహించినంత లేదు. ఎంత తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకు వెళితే అంత సంతృత్తి చెందుతారు' అని ఒకరు ట్వీటారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.
మరోవైపు పుష్ప ట్రైలర్ (Pushpa Trailer)పై సెలబ్స్ చాలామంది స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) స్పందిస్తూ... 'పుష్ప రాజ్.. తగ్గేదే లే' అని ఫైర్ ఎమోజీస్‌ను ట్వీట్ చేసింది. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'అల్లు అర్జున్ మాత్రమే సూపర్ స్టార్. ఇలాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి అసలు భయపడలేదు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారు ఇలాంటి పాత్రలు చేయగలరా?' అని పేర్కొన్నాడు. 'పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్' అని ట్రైలర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను కూడా సాసుకొచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook