Fake Ibomma Website: Ibomma వెబ్‌సైట్ అని క్లిక్ చేస్తే..మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ..
Fake Ibomma Websites In Telugu: ప్రస్తుతం గూగుల్ లో ఐ బొమ్మకు సంబంధించిన డూప్లికేట్ వెబ్‌సైట్‌లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ఏది ఒరిజినల్ వెబ్సైటో..ఏది డూప్లికేట్ వెబ్సైట్లు గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ మీరు ఐ బొమ్మ డూప్లికేట్ వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తే అంతే సంగతని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
Fake Ibomma Website Telugu: ప్రస్తుతం చాలామంది థియేటర్స్‌లో సినిమాలు చూడడం మానేశారు. దీనికి బదులుగా ఓటీటీలో వచ్చే సినిమాలను, సిరీస్లను ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లు పదుల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఈ ప్లాట్ ఫామ్స్ లో వచ్చే సినిమాలు చూడాలనుకుంటే తప్పకుండా డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఒకప్పుడు ఉన్న వాటికంటే సబ్స్క్రిప్షన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో చాలామంది బిల్ చెల్లించలేక ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఎక్కువగా స్ట్రీమింగ్ కోసం వినియోగించే అనధికారిక వెబ్సైట్లలో ఐ బొమ్మ ఒకటి. ఓటీటీలోకి వచ్చే ప్రతి ఒక్క సినిమా ఐ బొమ్మ(Ibomma)లో కూడా స్ట్రీమ్ అవుతోంది. అందుకే చాలామంది ఓటీటీలకు సబ్స్క్రిప్షన్ కట్టలేక ఈ ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను చూస్తున్నారు.
ప్రస్తుతం గూగుల్ లో ఐ బొమ్మకు సంబంధించిన అనేక వెబ్సైట్లు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది ఐ బొమ్మ(Ibomma)కు సంబంధించిన ఒరిజినల్ వెబ్‌సైట్‌లకు బదులుగా అదే పేరు మీద ఉన్న ఇతర వెబ్‌సైట్‌లలో పై క్లిక్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ లో ఐ బొమ్మకు సంబంధించిన ఒరిజినల్ వెబ్‌సైట్ ఒకటి మాత్రమే ఉంది. ఐ బొమ్మ పేరుతో ఉండే ఇతర వెబ్‌సైట్‌లన్ని ఫేక్ అని కొందరు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేక్ లింకులపై క్లిక్ చేసి ఆ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల స్మార్ట్ ఫోన్ కి అనేక రకాల సమస్యలు రావచ్చని వారంటున్నారు.
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
ప్రస్తుతం గూగుల్‌లో ఐ బొమ్మ అని టైప్ చేయగానే గ్రీన్ కలర్‌తో కూడిన వెబ్ ఐకాన్స్(Ibomma)తో పాటు ఎల్లో కలర్ ఐకాన్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటిల్లో చాలావరకు ఎల్లో ఐకాన్స్‌తో కూడినవి ఫేక్ అని తెలుస్తోంది..అంతేకాకుండా అనేక రకాల డొమైన్ పేర్లతో ఉన్న ఈ ఐబొమ్మ వెబ్‌సైట్‌లు తరచుగా వినియోగించడం మంచిది కాదని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్ ఫోన్‌లోకి మాల్వేర్ ప్రవేశించి మొబైల్ సెక్యూరిటీ సిస్టం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఫేక్ ఐ బొమ్మ సైట్లు ఏవో వాటిని గుర్తించి వినియోగించకపోవడం చాలా మంచిదని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి