Family Star Movie Review and Rating: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత విజయ్-పరుశురామ్ కాంబోలో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. సాంగ్స్, ట్రైలర్ వర్కవుట్ అవ్వడం.. ప్రమోషన్స్‌లో భారీగా నిర్వహించడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో మరోసారి గీతాగోవిందం సూపర్ హిట్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 5) ఫ్యామిలీ స్టార్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ రచ్చ మొదలైపోయింది. ట్విట్టర్‌లో ఆడియన్స్ ఏమంటున్నారు..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో హిట్ అందుకున్నాడా..? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్యామిలీ స్టార్‌కు ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంతమంది సినిమా బాగుందని చెబుతుంటే.. మరికొందరు సీరియల్‌లాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చని.. స్ట్రాంగ్ కమర్షియల్ వైబ్స్ ఉన్నాయని అంటున్నారు. సెకండాఫ్‌ మరింత ఉత్సాహంగా సాగుతుందని చెబుతున్నారు. ఎమోషన్ సీన్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని రివ్యూ ఇస్తున్నారు. డిసెంట్ ఫస్టాఫ్ అని.. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందంటున్నారు.


 



"డీసెంట్ ఫస్ట్ హాఫ్, కామెడీ బాగా వర్కవుట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, మృణాల్ చాలా బాగా నటించారు. ఒక మంచి ఫ్యామిలీ ట్రాక్ మూవీ. ఇంటర్వెల్ బ్యాంగర్ నిజంగా బాగుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ చాలా బ్యూటీఫుల్‌గా పనిచేసి సినిమాని కాపాడుతుంది.." అని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.
 



మరికొందరు మాత్రం ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉందని రివ్యూలు ఇస్తున్నారు. సీరియల్‌లా అనిపించిందని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కొంత పార్ట్ ఎంటర్టైన్ చేసేలా ఉన్నా.. ఏ మాత్రం కొత్తగా గానీ.. ఆసక్తికరంగా గానీ లేదని చెబుతున్నారు. ఇదొక రొమ్ కామ్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు. కొంత వరకు టైమ్ పాస్ అవుతుందంటున్నారు. రియల్ ఎమోషన్ గానీ, ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వడం మాత్రం జరగడం లేదంటున్నారు.


 




పరుశురామ్ సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్‌ను చూపించినట్లే ఈ సినిమాలో మృణాల్‌ను చూపించినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్‌లో పూర్ గర్ల్‌గా యాక్ట్ చేయగా.. ఫ్యామిలీ స్టార్‌లోనూ ఫస్ట్ హాఫ్‌లో మృణాల్ పూర్ గర్ల్‌గా నటించిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇది పేట్ల యూనివర్స్ ట్రోలింగ్ మొదలెట్టేశారు. 


 




"ఫ్యామిలీ స్టార్ చాలా ఫ్లాట్‌గా, అండర్‌వెల్‌గా ఉంది. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది. ఏదీ ఆకట్టుకోలేదు. స్పెషల్ ప్లాట్ పాయింట్లు, పర్ఫామెన్స్ లేదు. బోర్‌డమ్ మాక్స్. విజయ్ దేవరకొండ పూర్ ఛాయిస్. నేను లైగర్‌ని చూడాలనుకుంటున్నాను. చాలా నిరాశ చెందాను." అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 


 




 


Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన


Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook