Singer Uma Ramanan Passes Away: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నేపథ్య గాయని ఉమ కన్నుమూత..
Singer Uma Ramanan Passes Away: చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకదాని వెంట మరొకటి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవలో ప్రముఖ నేపథ్య గాయని ఉమ అనారోగ్యంతో కన్నుమూసారు.
Singer Uma Ramanan Passes Away: ప్రముఖ నేపథ్య గాయని ఉమా రామనన్ బుధవారం అనారోగ్యంతో కన్నుమూసారు. శాస్త్రీయ కళాకారిణి అయిన ఈమె దాదాపు 35 యేళ్లలో 65 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవా తదితర సంగీత దర్శకుల పాటకు గాత్రదానం చేసారు. కమల్ హాసన్ మహానది, ఒరు కైథియన్ డైరీ, అంగేట్ర వేళై మొదలైన ఎన్నో చిత్రాలకు గాత్రం అందించిన ఘనత ఈమెకు దక్కుతోంది. తెలుగులో ఈమె ' ఓ చినదాన' 'దిమ్ దిమ్ తార' అనే పాటను ఆలపించారు. ఈమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1976లో ప్రారంభమైన ఈమె ప్రస్థానం చనిపోయే వరకు కొనసాగింది.
Also read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook