Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!
Pop singer Taz passes away: చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ అనారోగ్య సమస్యలతో నిన్న కన్నుమూశారు.
Pop singer Taz passes away at 54: చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ పాప్ సింగర్ తర్సామీ సింగ్ సైనీ (తాజ్) కన్నుమూశారు. ఆయన వయసు 54. ఆయన చాలా సంవత్సరాలుగా హెర్నియాతో బాధపడుతున్నారు. దాని కోసం శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సర్జరీ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన (Pop singer Tarsame Singh Saini ) ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఇటీవల కోమా నుంచి కోలుకున్న తాజ్...నిన్న యూకేలో తుదిశ్వాస విడిచారు. గత నెల నుండి అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది.
తాజ్...90వ దశకం హిట్ సాంగ్స్‌కు పేరుగాంచిన పాప్ బ్యాండ్ స్టీరియో నేషన్‌కు ప్రధాన గాయకుడు. ఇది 1996లో స్థాపించబడింది. 1989లో 'హిట్ ది డెక్' ( Hit the Deck ) ఆల్బమ్‌తో తాజ్ గాయకుడిగా అరంగ్రేటం చేశాడు. ఈ ఆల్బమ్ 36 వారాల పాటు మెుదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అతడు 'జానీ జీ' పేరుతో పిలువబడ్డాడు. 'నాచంగే సారి రాత్', 'గల్లన్ గోరియన్', 'దారు విచ్ ప్యార్' వంటి హిట్ సాంగ్స్ ను అందించాడు తాజ్. ఇతను హృతిక్ రోషన్ నటించిన 'కోయి మిల్ గయా' (Koi Mil Gaya) చిత్రంలో 'ఇట్స్ మ్యాజిక్' అనే సాంగ్ ను పాడాడు. ఇది సూపర్ హిట్ అయింది.
'కోయి మిల్ గయా'తో పాటు 'తుమ్ బిన్' (2001), 'రేస్', 'గెస్ట్ ఇన్ లండన్ (2017), 'బాట్లా హౌస్' (2019) సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో పాటలు పాడాడు. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, సాంబార్ సల్సా వంటి చిత్రాలలో తాజ్ నటించాడు. జానీ జీ అని పిలవబడే టాజ్, అంతకుముందు సాంస్కృతిక ఆసియన్ ఫ్యూజన్ సంగీతానికి మార్గదర్శకుడిగా పిలువబడ్డాడు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పాప్ సింగర్‌కు నివాళులర్పిస్తున్నారు.
Also Read: Acharya Movie Collection: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook