Fighter Trailer: ఆకట్టుకున్న `ఫైటర్` ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న హృతిక్ ఏరియల్ యాక్షన్
Fighter: భారీ అంచనాల మధ్య హృతిక్ రోషన్ `ఫైటర్` ట్రైలర్ ఈరోజు పండుగ సందర్భంగా విడుదలైంది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది…
Hrithik Roshan: హృతిక్ రోషన్ కి యాక్షన్ సినిమాలతో ప్రత్యేక సంబంధం ఉంది. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా మంచి విజయం సాధించినవే. ముఖ్యంగా లక్ష్య సినిమాలో హృతిక్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గా మరచిపోలేని నటన కనబరిచారు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలెట్ గా ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది.
టైలర్ లో హృతిక్ రోషన్ పాత్రని షంషేర్ పఠానియ అలియాస్ పాట్టిగా అభిమానులకు పరిచయం చేశారు దర్శకుడు సిద్ధార్థ ఆనంద్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ డ్రాగన్స్ అనే స్పెషల్ టీమ్ కి లీడర్ గా ఈ సినిమాలో మనకి హృతిక్ కనిపించబోతున్నాడు. 2019లో జరిగిన పుల్వామా అటాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందుకు అనుగుణంగా హృతిక్ పాత్రని దర్శకుడు తీర్చిదిద్దారు.
ట్రైలర్ లో ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హృతిక్ రోషన్ లుక్స్ సూపర్ స్టైలిష్ గా ఉండటమే కాకుండా ఈ హీరో, చెబుతున్న హై వోల్టేజ్ డైలాగులు అభిమానుల్లో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. ముఖ్యంగా యాక్టన్, ఎమోషన్ కలగలిపి హృతిక్ ఇస్తున్న పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. ఫైటర్ జెట్ పైలెట్ గా హృతిక్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.
పుల్వామా అటాక్ సన్నివేశాలు.. దానికోసం తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ థియేటర్స్ లో తప్పకుండా ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయే సన్నివేశాలు అవుతాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇండియా 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరు రోజు ముందే అంటే జనవరి 25న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. కాగా ఈ చిత్రం 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లో రూపొందించారు.
వార్, బ్యాంగ్ బ్యాంగ్ తర్వాత హృతిక్ రోషన్ , సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే. ఫైటర్ చిత్రం ఏరియల్ యాక్షన్ లో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ఆసక్తిని పెంచుతోంది.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook