FIR filed against Praneet Hanumanth: తండ్రీకూతురుకు సంబంధించిన ఒక వీడియోపై డార్క్ కామెడీ పేరుతో.. అసభ్య వ్యాఖ్యలు చేయడంతో యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతుపై.. సోషల్ మీడియాలో ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సెలబ్రిటీ సైతం స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా..మెగా హీరో సాయి ధరంతేజ్ స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం పేరుతో సోషల్ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎంతోమంది యువతను,  చిన్నపిల్లలను అసభ్యకరంగా చిత్రీకరించి చూపిస్తున్నారని.. ఇలాంటి మృగాల నుంచి కాపాడాలి అంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను,  వీడియోలను సోషల్ మీడియాలో.. పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలని హెచ్చరిక జారీ చేశారు. 


 



అంతే కాదు ఇలాంటి మృగాలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని.. తెలంగాణ,  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులను , డిప్యూటీ ముఖ్యమంత్రులను ట్యాగ్ చేస్తూ మరియు ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్


 



సాయి ధరం తేజ్ ట్వీట్ పై తెలంగాణ డిప్యూటీ.. సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించి.. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. కలిసి పని చేద్దాం.. సోషల్ మీడియా మృగాల అంతు చూద్దాం అంటూ రీ ట్వీట్ చేశారు.


కాగా అసలు విషయానికి వస్తే.. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకైన ప్రణీత్ హనుమంతు అనే ఒక తెలుగు యూట్యూబర్.. ఆన్లైన్లో ఒక డిబేట్ చేపట్టాడు. ఇందులో కొంతమంది వ్యక్తులు పాల్గొనగా.. ఈ సందర్భంగా తండ్రి కూతుర్ల.. మధ్య సాగే ఒక వీడియో పై నోటికి వచ్చినట్లు వాగారు.. అసభ్యకర కామెంట్లు చేసి అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వాడు దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


 



ఈ వీడియో చూసిన తర్వాతనే హీరో సాయి ధరంతేజ్ తో పాటు హీరో మంచు మనోజ్ కూడా..ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. 


ఇక ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.. ధన్యవాదాలు సాయిధరమ్ తేజ్.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందుకు.. పిల్లల సేఫ్టీ ..ముఖ్యం కచ్చితంగా దీనిపై మేము యాక్షన్ తీసుకుంటాము అంటూ తెలిపారు.


 



దాంతో ఘటనపై తెలంగాణ పోలీసులు  రియాక్ట్ అయ్యారు.. అసభ్యకర రీతిలో సంభాషించిన యూట్యూబర్ పై వెంటనే కేసు నమోదు.. చేస్తున్నట్లు తెలంగాణ డిజిపి తెలిపారు.. ఈ మేరకు ఒక పోస్ట్ ని సాయి ధరంతేజ్ పోస్ట్ కు రిట్వీట్ చేస్తూ తెలంగాణ డిజిపి అధికారిక పేజీ నుంచి ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఆసభ్యకర.. రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు.



 



కాగా ఈ విషయంపై ప్రణీత్ హనుమంతు స్పందించారు.. క్షమించండి అంటూ కోరారు.. అయితే ఇతడు చేసినది సామాన్యమైన పని కాదు కాబట్టి ఎవరు అంత ఈజీగా దీనిని తీసుకోవట్లేదు అని తెలుస్తోంది. అందుకే ఇతడి పై తెలంగాణ డిజిపి కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.


 



ఐఏఎస్ కొడుకు అయిన ప్రణీత హనుమంతు ఈ మధ్యనే సుధీర్ బాబు హీరోగా చేసిన హరోం హరా సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు.


Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..


Also Read:​ డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి