Rakul preet singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నివాసం(Rakul preet singh house) ఉండే భవనంలో మంటలు(Fire Accident) చెలరేగాయి. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) విచారణ చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ర‌ష్మిక క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఫుడ్ సంస్థ.. రష్మిక మీల్స్‌ ఆఫర్


‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్(Rakul preet singh).. ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుని..టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లోనూ పలు సినిమాలలో నటిస్తోంది. ఇటీవలే తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన 'కొండపొలం' సినిమాలో నటించి ఆకట్టుకుంది.  క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా.. ఈఏడాది తన పుట్టినరోజు సందర్భంగా.. రకుల్ తన ప్రేమ విషయాన్ని భయటపెట్టింది. నిర్మాత జాకీ భగ్నానీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook