Nandamuri Balakrishna: అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి తో హ్యాత్రిక్ అందుకున్న బాలయ్య.. ఇప్పుడు తన తదుపరి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమైపోయాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్న యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ తన  109వ చిత్రం చేస్తున్నట్టు  అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ తన సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ ద్వారా నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి సీజన్ మన బాలయ్య కి బాగా కలిసొచ్చే సీజన్. ఆ సీజన్ లో విడుదలైన బాలకృష్ణ సినిమాలు చాలావరకు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మన ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతూ వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ బాలకృష్ణ  109వ సినిమా విడుదల కాబోతోంది.


 




ఈ నేపథ్యంలో ఈరోజు ఓ పవర్ఫుల్ పోస్టర్ తో సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.  ఇక ఈ పోస్ట‌ర్‌లో గొడ్డలికు ఓ కళ్లజోడును జోడించి ఉండగా ఆ కళ్ళజోడు లో ఎగిరిపడుతున్న విలన్లు మనకు కనిపిస్తాడు. ఇక అదే గొడ్డలికి ఓ లాకెట్‌ను కూడా ఉంది. అంతేకాకుండా బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్ అంటూ ఈ యాక్షన్ పోస్టర్ కి క్యాప్షన్ జోడించారు. కాగా ఈ ఫస్ట్ తోనే మేకర్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశారు.


ముఖ్యంగా ఈ పవర్ ఫుల్ పోస్టర్ చూస్తేనే ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుంది అని అర్థమవుతుంది.‌


ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా  నయనతార నటించనుందని తెలుస్తోంది. ఆమెను టీమ్ ఖరారు చేసిందని టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సింహా, శ్రీరామ రాజ్యం వంటి మంచి విజయం సాధించిన సినిమాలు వచ్చాయి. కాగా నయనతార పేరు అయితే సినిమా మేకర్స్ ఇంకా అఫీషియల్ గా తెలియజేయలేదు.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి