Fish Venkat: తెలుగు ఎన్నో చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో గుర్తుండిపోయే పాత్రల్లో మెప్పించిన నటుడు ఫిష్ వెంకట్. కానీ కొన్ని అనుకొని కారణాలవల్ల తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాడు. అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈయన ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తెలుసుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు తన వంతుగా లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. చదలవాడ శ్రీనివాసరావు  తరఫున ఫిష్ వెంకట్ కు లక్ష రూపాయలకు  చెక్కును  టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, దర్శకుడు కె. అజయ్ కుమార్,తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కలిసి అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ  మాట్లాడుతూ..  మా చదలవాడ శ్రీనివాసరావు ఎక్కడో ఓ వీడియోలో ఫిష్ వెంకట్ పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను చూసి ఆర్థిక కింద లక్ష రూపాయలు అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడక్కుండానే సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు.  


దర్శకుడు కె. అజయ్ కుమార్  మాట్లాడుతూ.. రాత్రి న్యూస్ ఛానల్ లో వేసిన ఒక వీడియోలో ఫిష్ వెంకట్ గురించి చూసి తెలుసుకుని చదలవాడ శ్రీనివాసరావు  లక్ష రూపాయలు సహాయం అందించడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.


టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..  నిజానికి ఫిష్ వెంకట్ గారు సహాయం కోరకుండానే  ఆయన పడుతున్న ఇబ్బంది తెలుసుకొని చదలవాడ శ్రీనివాసరావు మా ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించమని కోరడం జరిగింది. గతంలో కూడా చదలవాడ శ్రీనివాసరావు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కోవిడ్ టైంలో ఇండస్ట్రీలో ఎంతోమంది వర్కర్స్ కి సపోర్ట్ గా నిలబడ్డ విషయాన్ని ప్రస్తావించారు.  చిత్రపురి కాలనీ ద్వారా ఎంతో మంది వర్కర్స్ అక్కడ నివసించడానికి ఆయన వంతు సహాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇలా ఎంతో మంది జీవితాలని నిలబెట్టారు.


తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు మాట్లాడుతూ.. అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. కానీ అడగకుండానే సాయం చేసి మంచి వ్యక్తిగా నిలిచారు చదలవాడ శ్రీనివాసరావు.  


ఫిష్ వెంకట్ గారు మాట్లాడుతూ... నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే రూ.  లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.