Sandeep Kishan: సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కాలం చెల్లిన బియ్యం, నాసిరకం వస్తువులు గుర్తింపు
Sandeep Kishan Hotel: మన హీరోలు సినిమాలతో పాటు.. ఈ మధ్య బిజినెస్ లు కూడా ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెస్టారెంట్ బిజినెస్ ల పైన మన హీరోలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ బిజినెస్ ని ఈ మధ్యనే మొదలుపెట్టాడు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు..తనిఖీలు.. ఈరోజు చేశారు..
Sandeep Kishan Vivahabhojanam Restuarant: ఎంతోమంది టాలీవుడ్ హీరోలు.. రెస్టారెంట్ బిజినెస్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సినిమాలతో పాటు.. హైదరాబాద్లో రెస్టారెంట్లు నడుపుతూ.. ఉండడం మనం తరచూ చూసే విషయమే. ఇక ఇదే రూట్ ఫాలో అవుతూ సందీప్ కిషన్ కూడా.. ఈ బిజినెస్ లోకి ఈ మధ్యనే దిగారు.
అయితే గత కొద్ది కొద్దిరోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు.. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్.. అధికారులు.. జోరుగా తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పటికే.. ఇందులో భాగంగా.. ఎన్నో హోటల్స్ పరిశీలించారు.
ఈ హోటల్స్ లో.. పరిశుభ్రత, నాణ్యత పాటించని.. హోటల్స్ కు జరిమానా విధించి.. నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ ని కూడా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని సందీప్ కిషన్ హోటల్ అయినా.. వివాహ భోజనంలో.. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. అక్కడ వారికి కాలం చెప్పిన బియ్యంతోపాటు.. నాసిరకం వస్తువులు ఎక్కువగా బయటపడ్డాయి.
ఈ నాసిరికం వస్తువులతో.. ఈ హోటల్ వారు ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. అక్కడ ముందుగా వండిన ఆహార పదార్థాలు నిలువ చేసి.. ఫ్రిజ్లో పెడుతున్న తీరును అధికారులు గుర్తించారు. ఫ్రిజ్లో నిల్వచేసిన వస్తువులను.. అక్కడ వచ్చే కస్టమర్లకు.. మళ్ళీ..వేడి అందిస్తున్నారని.. ఫుడ్ ప్రిపరేషన్ కోసం వాడుతున్న నీటి కరిష్టం కూడా సరిగ్గా లేదని గుర్తించారు.
కిచెన్లో పరిశుభ్రత పూర్తిగా లోపించిందని గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను వాడుతున్నారు అని కూడా అధికారులు గుర్తించారు. అంతేకాదు అక్కడ.. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా లేవని.. వంటపాత్రలను క్లీన్ చేసిన నీళ్లని కూడా అక్కడే.. నిల్వ ఉండడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
ఈ మేరకు వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలను.. అక్కడ ఉపయోగిస్తున్న ఫుడ్ వివరాలను.. ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సందీప్.. చాలా కాలం క్రితమే ఫుడ్, రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారు. ఇప్పుడు ఆయన రెస్టారెంట్ కి ఇలా చెడ్డ పేరు రావడంతో.. ఈ హీరో ఎలా రియాక్ట్ అవుతారో అని చూస్తున్నారు అందరూ.
Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి