Oscar Entry Movies: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల మహోత్సవం సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ వివిధ దేశాల్లో ప్రారంభమైంది. నామినేషన్ ఎంట్రీకై దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆ పద్నాలుగు సినిమాలేంటనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 మార్చ్ నెలలో ఆస్కార్ అవార్డుల మహోత్సవం(Oscar Awards Ceremony)సిద్దమౌతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్నించి పలు విభాగాల్లో సినిమాలు పోటీ పడుతుంటాయి. 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగరీలో ఇండియా నుంచి అధికారిక ఎంట్రీకై పలు సినిమాలు పోటీ పడనున్నాయి. 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ..దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లే అర్హత ఉన్న సినిమాల్ని వీక్షించి ఎంపిక చేస్తుంది. ఈ ఎంట్రీల్లో 14 చిత్రాలు ఆస్కార్‌కు(Oscar Awards Nomination Movies)పంపించే స్థాయిలో ఉన్నాయని జ్యూరీ అభిప్రాయపడింది. ఇందులో హిందీ నుంచి సర్దార్ ఉధమ్, షేర్నీ, తమిళంలో మండేలా, మలయాళంలో నాయట్టు ఉన్నాయి. 


స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉధమ్ జీవిత(Sardar Udham)చరిత్ర ఆధారంగా  సర్దార్ ఉధమ్ చిత్రం తెరకెక్కింది. జలియన్ వాలాబాగ్(Jallian walla Bagh Incident)మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చేందుకు లండన్‌లో సర్దార్ ఉదమ్ పడిన కష్టాల్ని ఈ సినిమాలో తెరకెక్కించారు. విక్కీ కౌశల్ సర్దార్ ఉదమ్ పాత్ర పోషించారు. ఇక జనావాసంలో ఉన్న పులిని వేటాడే విషయంలో ఎదురయ్యే రాజకీయ ఒత్తిళ్ల నేపధ్యంలో తెరకెక్కింది షేర్నీ సినిమా(Sherni Movie).యోగిబాబు టైటిల్ రోల్‌లో నటించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ మండేలా. ఓ క్షురకుడి ఓటు తమ గెలుపుకు కారణమౌతుందని తెలిసి..అతన్ని మాయం చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు చేసిన ప్రయత్నమే మండేలా. ఇక రాజకీయ నాయకులు చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారతాయనేది చూపించేదే నాయట్టు సినిమా.


Also read: Akash Puri about Puri Jagannath: నాన్నా.. నీ పని అయిపోందన్నోళ్లకు నేనే సమాధానం.. Akash Puri emotional speech


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook