Galatta Geetu Behaviour: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన!
![Galatta Geetu Behaviour: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన! Galatta Geetu Behaviour: టీషర్టు లోపల చెయ్యి పెట్టుకోండి.. దిగజారి పోతున్న గీతూ ప్రవర్తన!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2022/09/10/244666-galatta-geetu-behaviour-in-bigg-boss-6-house-is-irritating.jpg?itok=C3-8c5VP)
Galatta Geetu Behaviour in Bigg Boss 6 House is Irritating: బిగ్ బాస్ 6 హౌస్ లో గలాటా గీతూ బిహేవియర్ చర్చనీయంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Galatta Geetu Behaviour in Bigg Boss 6 House is Irritating: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 21 మందితో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షో మొదటి వారం పూర్తి చేసుకోబోతోంది అయితే ఈ మొదటి వారంలో మొదటి హౌస్ కెప్టెన్ గా బాలాదిత్య నిల్వగా వరస్ట్ పెర్ఫార్మర్ గా గీతూ నిలిచింది. ఏకంగా హౌస్ లోని 15 మంది అయితే గీతూ ప్రవర్తన మీద ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా గీతూ ప్రవర్తన ఎవరికీ నచ్చడం లేదు. తనకు తాను ఒక మోనార్క్ ను అనే విధంగా తాను ఒక స్పెషల్ పర్సన్ లాగా ఆమె ఫీల్ అవుతుంది.
సెప్టెంబర్ 9వ తేదీ ప్రసారమైన ఎపిసోడ్లో గీతూ ప్రవర్తన ఎవరికీ నచ్చడం లేదు, ఎపిసోడ్లో ముందుగా బాలాదిత్య గీతూ పక్క పక్కనే కూర్చుని కనిపించారు. ఆ సమయంలో గీతూ కావాలని కాలు మీద కాలు వేసుకుని ఆ కాలు బాలాదిత్య ముఖం మీదకు వెళ్లే లాగా ఊపుతూ కూర్చుంది. ఇలా కాళ్లు ముఖం మీద పెట్టి కూర్చోవడం బాలేదని బాలాజీ చెబితే నీ మూతి మీద పెట్టి ఉపేనా అంటూ తనదైన చిత్తూరు యాసలో చిరాకుగా ముఖం పెట్టి చాలా వెటకారంగా మాట్లాడిన గీతూ ఏహ్య భావం కలిగించింది.
చాలా ఓపికగా బాలాదిత్య అలా ఊపడం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో బాలాదిత్య గెలిచి కెప్టెన్గా ఎంపిక అయితే ఆ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో కూడా గీతూ ప్రవర్తన అందరికీ ఒక్కసారిగా షాక్ కలిగించింది ఎందుకంటే ఈ కెప్టెన్సీ పోటుదారుల టాస్క్ విషయంలో మిగతా సభ్యులకు గీతూకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోటీ దారుల టాస్క్ ఆడే సమయంలో కొన్ని నెంబర్స్ ని ఏమంటున్నా టీ షర్ట్ లోపల దాచుకోవడం పట్ల ఇతర పోటీదారులు అభ్యంతరం తెలిపారు.
అయితే అది తన స్ట్రాటజీ అని ఆమె పేర్కొంది. నువ్వు టీ షర్టు లోపల వేసుకున్నావు కదా వాటిని ఎలా తీయాలని రోహిత్ అడిగితే అది నా స్ట్రాటజీ కావాలంటే లోపల చేయి పెట్టి తీసుకో అంటూ ఆమె దిగజారి మాట్లాడడం ఆమెకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక గేమ్ ఆడమని ఇచ్చాక అది జెన్యూన్ గా ఆడతామా లేక దొంగతనంగా ఆడతామా ఎలా ఆడి గెలుస్తామనేది మన ఇష్టం నేను న్యాయంగా ఆడను ఇలాగే ఆడతా ఇది నా స్ట్రాటజీ ఎలా అయినా నేను గెలవాలి పక్కన వాళ్ళు ఓడిపోవాలి అనేది నా స్ట్రాటజీ అంటూ గీతూ చెప్పుకొచ్చింది.
అయితే ఏమైనా చేస్తా అంటున్నావ్ ఒకవేళ టీ షర్ట్ లోపల అబ్బాయిలు చేయి పెట్టి తీసేస్తా అంటే, తీసుకొనీ నాకేమనిపించదు అంటూ బరితెగింపుతో మాట్లాడడంతో ఒక్కసారిగా కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ లో ఉన్నవారు అలాగే మిగతా హౌస్ సభ్యులు కూడా షాక్ అయ్యారు. గత బిగ్ బాస్ సీజన్ లో కూడా సిరి ఇలాంటి ప్రయత్నాలు చేసి కొంపముంచింది. తన పొట్ట భాగంలో దిండ్లు దాచుకోవడానికి ప్రయత్నించి సన్నీ ఎక్కడో చేయి పెట్టాడని రచ్చ చేసేందుకు ప్రయత్నించి తర్వాత అది తన స్ట్రాటజీ అని సన్నీ మంచివాడేనని నాగార్జున ముందు ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈమె కూడా సిరి బాటలోనే పయనిస్తూ చెయ్యి పెట్టి తీసుకున్నా నాకేం అభ్యంతరం అనిపించదు అంటూనే ఒకవేళ చేయి పెడితే దాని పెద్ద రచ్చగా క్రియేట్ చేసి ఆడుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ లో గీతూ బిహేవియర్ మాత్రం చాలామందికి నచ్చడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఆమె మీద ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.
Also Read: RC 16 with Narathan: ప్రశాంత్ నీల్ శిష్యుడితో రామ్ చరణ్ మూవీ.. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి