Bigg Boss Geetu Video : బిగ్ బాస్ టీం, నాగార్జున వల్లే ఎలిమినేషన్.. తప్పులన్నీ ఒప్పుకున్న గీతూ.. రియలైజ్ అయిందిగా
Galatta Geetu Video గలాట గీతూ తన ఎలిమినేషన్‌కు గల కారణాన్ని విశ్లేషించుకుంది. ఈ విశ్లేషణలో కొన్ని సిల్లీ పాయింట్లున్నాయి. ఇంకొన్ని మంచి వాలిడ్ పాయింట్లు తెలుసుకుంది.
Galatta Geetu Video on Elimination : బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన గీతూ తన ఎలిమినేషన్‌కు గల కారణాలను సరిగ్గా విశ్లేషించుకుంది. కానీ అందులోనూ కొన్ని తప్పులున్నాయి. వాటిని సరిదిద్దుకుంటుందో లేదో అన్నది పక్కన పెడితే.. గీతూ మాత్రం ఎలిమినేషన్‌ను తట్టుకోలేకపోయిందని అర్థమవుతోంది. నరసింహా సినిమాలో నీలాంబరిలా మారిపోయిందటి. రెండు మూడు రోజులు రూం నుంచి బయటకు రాలేదట. తన మీద ఫ్యాన్స్ చేసిన పాజిటివ్ కామెంట్లు చూసి కరిగిపోయిందట. మొత్తానికి గీతూ మాత్రం తాను ఓడిపోయిన విషయాన్ని అంగీకరించి.. తప్పులను సరిదిద్దుకుంటానని చెప్పింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన వీడియోను వదిలింది. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది.
[[{"fid":"251973","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నేను బాలాదిత్య అన్న ఈ షోకు ఫిట్ కాదు అని అన్నా.. మెరినా రోహిత్ ఇలా అందరూ తక్కువ అర్హత కలిగిన వారు అని అన్నాను. కానీ నేనే ఎలిమినేట్ అయి వచ్చానంటూ గీతూ చెప్పుకుంది. అలా పక్క వాళ్ల గురించి తక్కువ అంచనా వేసిన గీతూకి ఇలా ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి పిచ్చి విశ్లేషణలు, పిచ్చి కామెంట్లు, ఎదుటి వాళ్లను తక్కువ చేసినట్టుగా మాట్లాడే మాటలే గీతూని ముంచేశాయి.
[[{"fid":"251974","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఇక గీతూ ఓ రివ్యూయర్. ఎక్కడ ఎలా నటిస్తే మార్కులు పడతాయో తెలుసు. బాలాదిత్యను బ్యాడ్ చేయాలనుకుంటే.. సిగరెట్ల విషయంలో అన్న మాటలకు తాను ఏడ్చి పెద్ద సీన్ చేసిన అతడ్ని నెగెటివ్ చేసే చాన్స్ ఉందని, కానీ తనకు బాలా అన్న అంటే ప్రేమ అని అలా చేయలేదంటూ.. తాను ఇంట్లో ఉన్న ఏ సమయంలోనూ ఎప్పుడూ కూడా ఫేక్‌గా నటించలేదని గీతూ చెప్పుకొచ్చింది.
బిగ్ బాస్ ఇంట్లో తాను ఓ గేమర్‌లా ఆడానని, ఆడియెన్స్‌లానే ఆడానని, ఓ కంటెస్టెంట్‌లా ఆడలేదని గీతూ రియలైజ్ అయింది. దాని వల్లే ఎలిమినేట్ అయ్యానంటూ తెలిపింది. చిన్నతనం నుంచి అన్ని రకాల గేములు ఆడేదాన్ని పబ్జీ కూడా ఆడాను.. పబ్జీలో చికెన్ డిన్నర్ రాకపోతేనే మనం ఎంత బాధపడతాం.. మన ఫ్రెండ్ అవతల టీంలో ఉంటే చంపేస్తాం కదా అంటూ పబ్జీ గేముతో బిగ్ బాస్ షోను కూడా పోల్చింది. వీడియో గేములు ఆడానంటూ.. తాను ఓ గేమర్ అంటూ.. బిగ్ బాస్ గేమ్ గురించి చెబుతూ తన నాలెడ్జ్ ఏపాటిదో బయట పెట్టేసుకుంది.
[[{"fid":"251975","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
బిగ్ బాస్ షో అంటే కేవలం ఒక ఆట మాత్రమే అనుకుంది కాబట్టే గీతూ బయటకు వచ్చింది. బిగ్ బాస్ అంటే ఆట మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. మనిషిగా మనసుతో ఆడాల్సి ఉంటుంది. ఆట ఆడితే కొందరికి నచ్చుతారేమో.. కానీ మంచి మనిషిని మాత్రమే జనాలు గెలిపిస్తారు. ఓ ఎమోషన్‌తో ఆడియెన్స్‌కు కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆటలు ఆడిన శ్రీముఖి గెలవలేదు. ఎమోషన్‌తో రాహుల్ గెలిచాడు. టాస్కుల్లో ఎక్కువగా పర్ఫామెన్స్ చేయని అభిజిత్ విన్నర్ అయ్యాడు. తన ప్రవర్తనతో అందరినీ మెప్పించాడు. ఆ విషయాన్ని గీతూ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఆట ఆట అంటూ బిగ్ బాస్ పిచ్చిలో తనని తాను మరిచిపోయింది.
తాను ఒక సాఫ్ట వేర్ ఎంప్లాయ్‌ని అని, అందుకే అన్నింట్లో లూప్స్ వెతికి, పనిని స్మార్ట్‌గా పూర్తి చేయాలని అనుకుంటాను.. అందుకే ప్రతీ గేములో లూప్స్ వెతికేదాన్ని, అవి మీకు నచ్చలేదు.. అవి తుప్పాస్ లూప్సే అనుకోండి.. అంటూ తన పిచ్చి లూప్స్ గురించి చెప్పుకుంది. అవి తప్పు అని ఎవ్వరూ చెప్పలేదని అంటూనే ఆదిరెడ్డి చెప్పినా వినిపించుకోలేదని అంటోంది. అలా రెండు మాటలు ఆమే మాట్లాడుతోంది. ఇవన్నీ సరిపోనట్టుగా ఇందులో జెండర్ ఇష్యూని కూడా తీసుకొచ్చింది.
[[{"fid":"251976","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
తాను అమ్మాయిని కాబట్టే.. అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. తక్కువ మాట్లాడాలి.. అలా కూర్చోవాలి.. ఇలా కూర్చోవాలి.. ఇలా మాట్లాడాలి.. మగాళ్లతో పోటీగా ఉండకూడదని అనుకున్నారు.. ఇది పురుషాధిక్య సమాజం అందుకే ఎలిమినేట్ అయ్యానంటూ మళ్లీ పిచ్చిగా మాట్లాడేసింది.కౌశల్ తాను గేమ్ మాత్రమే ఆడతాను అని ఎమోషన్స్ పెట్టుకోను అంటే కరెక్ట్ అన్నారు.. నేను అలా అంటే మాత్రం ఇలా చేశారంటూ గీతూ వాపోయింది. రోబో టాస్కుల్లో అభిజిత్ ప్లాన్ వేస్తే మేధావి అన్నారు.. నేను అలా స్ట్రాటజీలు వేస్తే మోసం అని అంటున్నారంటూ చెప్పుకొచ్చింది. అయితే గీతూ మాటల్లో ఏ మాత్రం అర్థం లేదనిపిస్తోంది. అలా అనుకుంటే బిగ్ బాస్ ఓటీటీలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచింది. జనాలకు నచ్చితే ఆడ, మగ అని తేడా చూడరు.. ఎవరినైనా గెలిపిస్తారని బిందు మాధవి నిరూపించింది.
[[{"fid":"251977","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
బిగ్ బాస్ వల్ల ఎంతో నేర్చుకున్నానని, ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నానని, మనుషుల విలువ అర్థమైందని, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దని తెలుసుకున్నాను అంటూ గీతూ చెప్పుకొచ్చింది. ప్రతీ వారం, ప్రతీ టాస్కులో నన్ను బిగ్ బాస్ టీం పొగిడేసింది. బిగ్ బాస్ అయితే నాతో ఎంతో ప్రేమగా ఉండేవాడు.. నాగార్జున సర్ అయితే నన్ను ఎంతో మెచ్చుకునేవాడు.. అందరూ నేను చేసేది రైటే అని అనేవారు.. దీంతో నా అంత తోపు ఎవ్వరూ లేరని అనుకున్నా.. దాంతో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది.. అందుకే సంచాలక్‌గా ఆటలు ఆడించా.. పిచ్చి లూప్స్ వెతికా.. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఎలిమినేట్ అయ్యా.. అది మనిషికి ఉండొద్దు.. నన్ను పొడిగి పొడిగి మునగ చెట్టు ఎక్కించారు.. అక్కడి నుంచి పడేశారు అని గీతూ చెప్పుకొచ్చింది.
[[{"fid":"251978","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
నేను కెప్టెన్ అవ్వకుండానే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను సర్ అని నాగార్జునతో అంటే.. ఈ తొమ్మిది వారాలు రూల్ చేసింది నువ్వే అని నాగార్జున అన్నాడట. బిగ్ బాస్ 6 అంటే గీతూనే.. గీతూ జెండా పాతేసిపోతోంది అంటూ యాంకర్ శివ కూడా అన్నాడట. ఇలా అందరూ పొగిడే సరికి ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా? కానీ ఎవరో పొగిడేశారని, ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వొద్దు అని గీతూ చివరకు తాను నేర్చుకున్న గుణపాఠాన్ని అందరికీ చెప్పింది.
Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
Also Read : Nachindi Girlfriendu Movie Review : నచ్చింది గాళ్‌ఫ్రెండూ మూవీ రివ్యూ.. షేర్ మార్కెట్ల మోసాలపై గురి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook