Ram Charan - Game Changer: రాజమౌళి డైరెక్షన్‌లో చేసిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో'గేమ్ చేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 8 సెప్టెంబర్ 2021లో ప్రారంభమైంది. ఇక రామ్ చరణ్ పోర్షన్ 6 జూలైన కంప్లీటైంది. ఈ మూవీలో హీరో పాత్ర చిత్రీకరణకు 2 నెలలు తక్కువగా మూడేళ్లు పట్టింది. ఓ బడా హీరో ఎలాంటి గ్రాఫిక్స్ లేని చిత్రానికి ఇన్ని రోజులు డేట్స్ కేటాయించడం మాములు విషయం కాదు.  మరోవైపు శంకర్.. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమా చేయాల్సి రావడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైనట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు కొంచెం ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. దీనిపై అధికారికంగా ప్రకటించనున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ మూవీ ఎపుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమాలో రామ్ చరణ్ .. ‘రామ్ నందన్’ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రభుత్వ అధికారి.. ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం.


'గేమ్ ఛేంజర్' మూవీ తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబు సన డైరెక్షన్ లో పూర్తి గ్రామీణ నేపథ్యంలో  స్పోర్ట్స్  డ్రామా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో రామ్ చరణ్‌ సరసన  జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్.. మరో ప్యాన్ ఇండియా చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి