Game Changer Movie Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ.. రామ్ చరణ్ కుమ్మేసాడా..!
Game Changer Movie Review: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ హిట్టు అందుకున్నాడా..! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
మూవీ: ‘గేమ్ చేంజర్’ (Game Changer)
నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్.జే.సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, నరేశ్, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ తదితరులు..
ఎడిటింగ్: షమీర్ మొహమద్, రూబెన్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
స్టోరీ: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాటోగ్రఫీ: తిరు
సంగీతం: తమన్
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: శంకర్
రన్ టైమ్ : 165 మినిట్స్
విడుదల తేది : 10-1-2025
ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తో రామ్ చరణ్ ఇమేజ్ పెరగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాతో పలకరించారు. కానీ ఆచార్య మెగాభిమానుల అంచనాలను అందుకోలేక చతికిలబడింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ చేసాడు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
రామ్ నందన్ (రామ్ చరణ్ ) నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. అతని ఐపిఎస్వి ఐపీఎస్ ఆఫీసర్ కూడా. రాజకీయ నాయకుల పాలిట సింహ స్వప్నం. అంతేకాదు అవినీతి రాజకీయ నాయకులపై పోరాడుతుంటాడు. ఈ క్రమంలో దేశాన్ని అవినీతి రహితంగా చేయాలని అభ్యుదయ పార్టీ లీడర్ అప్పన్న (రామ్ చరణ్ ) ఆశయాన్ని రామ్ నందన్ నెరవేర్చాడా.. ? ఈ నేపథ్యంలో రామ్ నందన్ అవినీతి పరుడైన ముఖ్యమంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ అవినీతి రహిత సమాజం అన్న అప్పన్న ఎవరు ? చివకు రామ్ నందన్ కోరుకున్న సమ సమాజం ఏర్పడిందా ? ఈ క్రమంలో రామ్ నందన్ అవినీతి పరులైన రాజకీయ నాయకులను ఎదుర్కొవడానికి ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేసాడనేది తెలియాలంటే ‘గేమ్ చేంజర్’ మూవీ చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
శంకర్ ఓ కథను ఎంత అందంగా తెరపై చూపిస్తాడనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జెంటిల్మెన్ నుంచి అది కనిపిస్తూనే ఉంది. సామాజిక అంశాలనే స్టోరీలుగా తీసుకొని సక్సెస్ కొట్టడం శంకర్ మార్క్ స్టైల్. ఇపుడు కూడా మన సమాజంలో పట్టి పీడిస్తూన్న అవినీతి రాజకీయ నాయకుల కారణంగా ప్రజలకు న్యాయ బద్దంగా అందించాల్సిన హక్కులు దక్కడం లేదు. నాయకులు కేవలం ప్రజలను ఓటు బ్యాంకు గానే పరిగణిస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టారు. సగటు రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలవడానిక చేసే జిమ్మిక్కులను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూసిందే. ఇందులో అదే పాయింట్ ను మెన్షన్ చేసాడు. ఇందులో రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను రామ్ చరణ్ తో మంచి నటనను రాబట్టుకున్నాడు. హీరోయిజం పండాలంటే విలన్ ఎలివేషన్ బాగుండాలి. ఇందులో ఎస్.జే. సూర్య .. రామ్ చరణ్ కు తన నటనతో గట్టి పోటీ ఇచ్చాడు. తన విలనిజంతో హీరోయిజం పండేలా ఇద్దరి నుంచి శంకర్ మంచి నటన రాబట్టుకొన్నాడు. మరోవైపు రాజకీయ నాయకులు ఇచ్చే ఉచితాల వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారనే విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఉచిత తాయిలాలు ఎక్కువై పోయాయి. వీటిపై తనదైన శైలిలో సునిశిత విమర్శలు చేసాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. శంకర్ మార్క్ సినిమాల ప్రభావం జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ సినిమాల్లోని సీన్స్ గుర్తుకు వస్తాయి. అంతేకాదు అడగడున శంకర్ మార్క్ లావిష్ నెస్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అభ్యుదయ పార్టీ నేత అప్పన్న, బొబ్బిలి మోపిదేవి ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పాటల్లో మరోసారి శంకర్ మరోసారి తన మార్క్ చూపించాడు. తెలుగు నటీనటులు ఉన్నా.. అక్కడక్కడ తమిళ వాసనలు కనపడ్డాయి. హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఒకప్పటి టి.కృష్ణ, దాసరి సినిమాలు చూసిన వాళ్లకు గేమ్ చేంజర్ ఏమంత గొప్పగా కనిపించదు. ఇందులో కొన్ని పాత్రలు ఎందుకున్నాయో తెలియదు. ఏదో భారీ బిల్డప్ కోసమే తప్పించి అందులో కొన్ని పాత్రలకే ప్రాధాన్యత ఉంది. అదే సోషల్ ఇష్యూను పూర్తి కమర్షియలైజ్ యాంగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ కథ సో సో గా ఉన్నా సాయి మాధవ్ మరోసారి తన కలం కున్న పదును ఏంటో చూపించాడు. గతంలో ఇలాంటి తరహా సినిమాలు తెలుగులో వచ్చినా.. ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాలి. ఈ సినిమా సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫేములో నిర్మాతలు డబ్బులు కనిపిస్తాయి. ఎడిటర్ కొన్ని సన్నివేశాల్లో తన కత్తెరకు పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
రామ్ చరణ్ అప్పన్నగా.. రామ్ నందన్, చరణ్ పాత్రల్లో ఒదిగిపోయాడు. మూడు పాత్రల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు. ఒక రాజకీయ నాయకుడిగా.. ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో ఒదిగిపోయాడు. అంజలి ఉన్నంతలో సినిమాకు ఆయువు పట్టు లాంటి అప్పన్న భార్య పార్వతి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. అటు కియారా అద్వానీ .. గ్లామర్ డాల్ గానే కనిపించింది. ఎక్కడా పెద్దగా నటించే స్కోప్ కనిపించలేదు. ఇక ఎస్.జే. సూర్య హీరో రామ్ చరణ్ కు ధీటుగా నటించాడు కాదు కాదు జీవించాడు. విలన్ గా ఈ సినిమాలోని పాత్ర అవార్డు వచ్చి తీరాల్సిందే. అటు సముద్రఖని, జయరామ్, శ్రీకాంత్, వెన్నెల కిషోర్, సునీల్ తమ పాత్రల్లో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్, ఎస్.జే.సూర్య నటన
భారీ తనం, యాక్షన్ ఎపిసోడ్స్
తమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ, కథనం
ఎడిటింగ్
క్లైమాక్స్
పంచ్ లైన్.. ‘గేమ్ చేంజర్’.. రొటిన్ రివేంజ్ పొలిటికల్ డ్రామా..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.