Game Changer: గేమ్ చేంజర్ గురించి షాకింగ్ అప్డేట్.. ఇది పాన్ ఇండియా సినిమా కాదంట!
Ram Charan: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజెర్. రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారేమో అని ఎన్నో ఆశలు పెట్టుకో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Game Changer Update: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రామ్ చరణ్. అయితే ఆ చిత్రం తరువాత రామ్ చరణ్ చిరంజీవితో చేసిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఆ చిత్రంలో కేవలం రామ్ చరణ్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉండడంతో ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న మొదటి సినిమా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ చిత్రం దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్లోనే ఉండడం వల్ల సాధారణ ప్రేక్షకులకు ఈ చిత్రంపై ఇంట్రెస్ట్ కూడా పోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి వస్తున్న మరో వార్త సైతం రామ్ చరణ్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలు విషయం ఏమిటి అంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫుల్ లెంట్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ కావడంతో ఈ చిత్రం తప్పకుండా పాన్ ఇండియా వైడ్ విడుదలవుతుంది అనుకున్నారు అందరూ. కానీ ఈ సినిమా కేవలం మూడు భాషల్లోనే రిలీజ్ చేయబోతున్నారట. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఈ చిత్రంలోని ‘జరగండి’ సాంగ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ కరెక్ట్ గా గమనించినట్టయితే ఆ పోస్టర్ లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులకు ఈ సినిమా వల్ల మరోసారి నిరాశ ఎదురైంది.
ప్రస్తుతం రామ్ చరణ్ కి ఉన్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కానీ పాన్ ఇండియా వైడ్ విడుదల అయితే.. ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయం.. అలాకాకుండా ఇలా కేవలం మూడు భాషలలోనే విడుదల అయితే కలెక్షన్స్ పరంగా సినిమాపై ప్రభావం పడొచ్చు అని చరణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఈ సినిమా నుంచి ‘జరగండి’ పాట ని రేపు మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సాంగ్ తో పాటు ఈ సినిమా విడుదల తేదీ కూడా తెలియజేసి.. రామ్ చరణ్ అభిమానులను ఈ సినిమాలోని కొంచెం అన్న ఖుషి చేస్తారేమో చూడాలి.
Also Read: Viral Video: షాకింగ్ లో మహిళ.. రీల్స్ చేస్తుండగా ఆ పనికానిచ్చిన ఆగంతకుడు.. వీడియో వైరల్..
Also Read: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter